మా ఆయన మామూలుగానే ఏమీ చేయడు..ఇంకా పండగకు ఎం చేస్తాడు
on Jan 11, 2025
ఢీ జోడి సంక్రాంతి స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఇందులో డాన్స్ లు మాములుగా లేవు. అందరూ అద్భుతంగా డాన్స్ చేశారు. ఇందులో ఆది ఐతే ముగ్గు వేయడానికి చుక్కలు పెట్టాడు. తరవాత సోనియా వచ్చి ముగ్గు వేసింది. దాంతో "అరె సిద్దు..నువ్వు మంచి భార్యనే పట్టావురా..మా ఆవిడకు ఏమీ రాదు అంటూ" అశ్విని గురించి అనేసరికి అశ్విని షాకైపోయింది. తర్వాత సోనియా అశ్వినితో "మీ ఆయన పండగ ఏమీ సెలెబ్రేట్ చేయట్లేదా అండి" అని అడిగింది. దానికి సోనియా "మా ఆయన మామూలుగానే ఏమీ చేయడు..ఇంకా పండగకు ఎం చేస్తాడు" అంటూ ఆన్సర్ ఇచ్చింది.
ఆ మాటలు హైపర్ ఆది వినేసి "అవును మరి మీ ఆయన పెద్ద పోటుగాడు" అంటూ గట్టిగా అరిచాడు. తర్వాత ఆది మాఫ్ పెట్టి స్టేజి మొత్తం క్లీన్ చేస్తూ కనిపించాడు. వెంటనే హన్సిక చెత్త కాగితాలన్నీ వేసేసి తుడువు అంటూ అరిచింది. ఆది హన్సిక దగ్గరకు వచ్చి "మా సంక్రాంతి మామూలు ఇవ్వలేదు" అనేసరికి అందరూ నవ్వుకున్నారు. ఇక ఫైనల్ గా సంక్రాంతి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక హన్సిక వచ్చి సోనియాతో కలిసి డాన్స్ చేసేసింది. ఇక నెటిజన్స్ ఐతే హన్సిక చాలా బాగుంది అంటుంటే ఇది ఢీ షో కాదు కామెడీ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read