Illu illalu pillalu : తప్పించుకున్న కళ్యాణ్.. ప్రేమని కాపాడేందుకు తాళి కట్టిన ధీరజ్!
on Jan 10, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -52 లో......వేదవతి, ధీరజ్, నర్మద లు పూజ పూర్తి చేసి బయటకు వస్తారు. అప్పుడే ధీరజ్ కి రామరాజు ఫోన్ చేసి అమ్మకి ఫోన్ ఇవ్వమంటాడు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను ధైర్యంగా ఉండమని ప్రేమ విషయం చెప్తాడు. దాంతో పాటు సేనాపతి గురించి మొత్తం చెప్తాడు. దాంతో వేదవతి టెన్షన్ పడుతుంది. నా కోడలు వెళ్లిపోవడమేంటి అంటూ బాధపడుతుంది. మీరు త్వరగా రండీ అని రామరాజు వాళ్లకి చెప్తాడు.
మరొకవైపు కళ్యాణ్ దగ్గరకి ప్రేమని అమ్మాలనుకుంటున్న అతను, కొంతమంది రౌడీ లతో వస్తాడు. డబ్బులు ఇంకా ఎక్కువ కావాలని కళ్యాణ్ అనగానే తన పీకపై కత్తి పెట్టి అతను బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ అతనిపై కోపం తో పోలీసులకి ఫోన్ చేసి హోటల్ లో ఒక అమ్మాయితో ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్, నర్మద, వేదవతి లు వస్తుంటారు. అప్పుడే సడన్ గా ధీరజ్ కి కళ్యాణ్ డాష్ ఇస్తాడు. నువ్వేంటి ఇక్కడ ప్రేమ ఎక్కడ అంటూ కొడతాడు. దాంతో కళ్యాణ్ భయపడి ప్రేమ హోటల్ లో ఉంది. ఇప్పుడే పోలీసులకి ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంటూ చెప్పానని చెప్పి కళ్యాణ్ తప్పించుకుంటాడు. వెంటనే ధీరజ్ వాళ్ళు హోటల్ కి వెళ్తారు.
అప్పుడే పోలీసులు కూడా వస్తారు. ఇప్పుడు ప్రేమని కాపాడలేం పోలీసులు స్టేషన్ కి తీసుకొని వెళ్తే తన జీవితం స్పాయిల్ అవుతుందని నర్మద అంటుంది. అప్పుడే వేదవతి దగ్గరున్న అమ్మవారి దగ్గర తాళిబొట్టు తీసుకొని వెళ్లి ప్రేమ మెడలో కట్టమని వేదవతి చెప్తుంది. మరొక వైపు రౌడీలు ప్రేమ దగ్గరికి వెళ్తుంటారు. పోలీసులని చూసి పారిపోతారు. ఆ తర్వాత ఇక వేరే దారి లేక ధీరజ్ వెనకాల నుండి గదిలోకి వెళ్లి ప్రేమ వద్దంటున్నా తన మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



