Brahmamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చేస్తానని మాటిచ్చిన కావ్య.. శ్రీను దొరుకుతాడా!
on Jul 19, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -777 లో..... కావ్యకి రేవతి గురించి మొత్తం చెప్తుంది ఇందిరాదేవి. రేవతి పెళ్లి చేసుకొని వచ్చాక సుభాష్, అపర్ణ ఇద్దరు ఇంట్లో నుండి గెంటేసారు.. అపర్ణ కోపంతో నీ ఆస్తులు వీటి కోసమే కదా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోమని అపర్ణ పేపర్స్ రేవతి మొహంపై విసిరేస్తుంది. నాకు వద్దని రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా కావ్యకి వివరంగా చెప్తుంది ఇందిరాదేవి. మీరేం కంగారు పడకండి అమ్మమ్మ గారు రేవతిని ఈ కుటుంబానికి నేను దగ్గర చేస్తానని ఇందిరాదేవితో చెప్తుంది కావ్య.
మరొకవైపు అపర్ణ తనలో తనే రేవతి కొడుకు స్వరాజ్ ని గుర్తుచేసుకొని నవ్వుకుంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. దాంతో స్వరాజ్ గురించి చెప్తుంది ఆ బాబు.. ఎంత బాగా మాట్లాడాడో మళ్ళీ ఒకసారి తనని కలవాలని ఉందని అపర్ణ అనగానే అనుకో జరుగుతుందని సుభాష్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి ఎప్పటిలాగే కావ్యకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది.
రేపు అప్పు కేసు నుండి బయటకు వస్తుందని ఆశ పడుతున్నావా అసలు జరగదని యామిని అనగానే తనపై కావ్య కోప్పడుతుంది. అప్పుని కేసు నుండి ఎలా బయటపడెయ్యాలని కావ్య ఆలోచిస్తుంటే.. రాజ్ దగ్గరికి యామిని వచ్చి మాట్లాడుతుంది. మరోవైపు శ్రీను వాళ్ళ అమ్మకి ఎలాగైనా కాల్ చేస్తాడు.. ఆ ఫోన్ కాల్ సిగ్నల్ ట్రేస్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది కదా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



