వీళ్లకు ఇంత చిన్న స్పెల్లింగ్స్ కూడా రావా
on Jul 18, 2025
.webp)
కూకు విత్ జాతిరత్నాలు షో ప్రతీవారం ఫుల్ మీల్స్ తో పాటు కామెడీని కూడా సర్వ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. పాన్ ఇండియా వంటలు, మార్కులు, రకరకాల రుచులు, కామెడీ కబుర్లతో ఈ ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక ఇందులో మార్కులను బట్టి అడ్వాంటేజ్ టాస్కులు వంటివి కూడా ఉంటున్నాయి. రీసెంట్ గా నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అడ్వాంటేజ్ టాస్క్ చూస్తే...ఎవ్వరికైనా నవ్వురాకుండా ఉండదు. "ఇక్కడి నుంచి నేను ఒక వస్తువును చూపిస్తాను. కుక్కు దాన్ని ఇంగ్లీష్ లో పేరు చెప్తారు జాతిరత్నం ఆ స్పెల్లింగ్ లెటర్స్ ని బోర్డు మీద కరెక్ట్ గా పెట్టాలి" అని ప్రదీప్ టాస్క్ డీటెయిల్స్ చెప్పాడు. ఇంతలో సుజిత వచ్చి "నా జాతి రత్నాలు ఊటీ కాన్వెంట్ లో చదువుకుని వచ్చారు" అన్నది.
"అంటే మరి ఇక్కడ చెప్పగలరా లేదంటే ఊటీ వెళ్ళాలా మేము" అంటూ ప్రదీప్ కౌంటర్ వేసాడు. ఇక పొటాటో అని తనూజ చెప్పేసరికి ఇమ్మానుయేల్ పొట్ట అన్నాడు అంతే పొట్ట కాదు పొటాటో అంటూ తనూజా ఫుల్ ఫైర్ అయ్యింది. ఇక హరి పైన్ ఆపిల్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ తప్పుగా పెట్టాడు. స్పెల్లింగ్ తప్పు పెట్టాడు పైగా ఇది కరెక్ట్ అని చెప్పుకుని తిరుగుతున్నాగా ..ఈ స్పెల్లింగ్ కూడా రాదు అంటే కిందన వేసుకుంటారేమో అంటూ ఫుల్ కామెడీ చేసాడు. తర్వాత బాటిల్ గార్డ్ అనే స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో సుహాసిని పెట్టాలి. కానీ తప్పు పెట్టింది. దాన్ని ప్రదీప్ హైలైట్ చేసి చూపించాడు. "ఏ స్కూల్ లో చదివావమ్మా" అంటూ రాధ అడిగారు. "చెప్తే మా వాళ్లందరినీ దానికే పంపిస్తాం" అంటూ ప్రదీప్ కూడా కౌంటర్ వేసాడు. ఈ ప్రోమో కింద నెటిజన్స్ ఐతే వీళ్లకు స్పెల్లింగ్స్ కూడా రావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



