Karthika Deepam2 : జ్యోత్స్న ఇచ్చిన చెక్ గురించి కాశీ చెప్పేస్తాడా.. మరదలిని ఇరికించేసిన కార్తీక్!
on Jul 19, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -413 లో.....దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే కాంచన వస్తుంది. మళ్ళీ మీరేం చేస్తున్నారు చెప్పండి.. ఇప్పుడు గానీ మళ్ళీ ఎంగేజ్ మెంట్ ఆగిపోతే మా వాళ్ళు బాధపడుతారు. మీరు వాళ్లతో మాటలు పడుతారు. నేను అదంతా భరించలేనని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. నువ్వేం కంగారుపడకు అమ్మ గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. ఈ ఎంగేజ్ మెంట్ చేసుకోదు ఎలాగైన దీప మాటలు పడాలని ప్లాన్ చేస్తుంది.
కానీ తన చేతనే నిజం ఒప్పుకునేలా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నామని కార్తీక్ కాంచనకి అర్ధం అయ్యేలా చెప్తాడు. మరొక వైపు శ్రీధర్ ఇంటికి వచ్చి.. అల్లుడు మీ నాన్న వచ్చాడాట కదా అని చెప్తాడు. అవును మావయ్య మేమ్ వెళ్తున్నామని కాశీ అంటాడు. ఆ తర్వాత కాశీకి కార్తీక్ ఫోన్ చేసి గౌతమ్ మంచివాడు కాదని సాక్ష్యాలు అన్నీ ఉన్నాయ్ కదా.. అవి పట్టుకొని డైరెక్ట్ మీ జ్యోత్స్న అక్క దగ్గరికి వచ్చేయ్ అని కార్తీక్ చెప్పగానే కాశీ సరే అంటాడు.
ఆ తర్వాత కాశీ ఇంటికి వచ్చి జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. నువ్వు బయట ఉండు అని జ్యోత్స్న అంటుంది. కానీ కాశీ లోపలికి ఒక కవర్ పట్టుకొని వస్తాడు. అప్పడే అక్కడున్న శివన్నారాయణ చూసి ఏంటది అని అడుగుతాడు. ఏం లేదని పారిజాతం అంటుంది. తీరా చుస్తే అందులో జ్యోత్స్న కాశీకి ఇచ్చిన చెక్ ఉంటుంది. అదేంటి గౌతమ్ మంచివాడు కదాని సాక్ష్యాలు తెస్తాడనుకుంటే ఇలా తెచ్చాడని జ్యోత్స్న షాక్ అవుతుంది. మరదలు షాక్ అయినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. చెక్కు ఏంటని శివన్నారాయణ అడుగగా.. ఎక్కడ నిజం చెప్తాడోనని జ్యోత్స్న కవర్ చేస్తుంది. బావ ఇదంతా నీ ప్లానా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



