Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో ముఖేష్ టాప్..డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే!

Nov 5, 2026 8:28AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో తొమ్మిదవ వారం ఓటింగ్ లో సంచలన మార్పులు కనిపిస్తున్నాయి. రివార్డ్ అండ్ రివేంజ్ టాస్క్ లు, ఫ్యామిలీ వీక్ రేస్, సుధీర్ - ముఖేష్ గొడవ, వంశీ విజయం తర్వాత ఆడియన్స్ ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం ముఖేష్ మిగతా అందరికంటే భారీ లీడ్ లో ఉన్నాడు.

ముఖేష్ కు ఏకంగా 31.32% ఓట్లు (36,409 ఓట్లు) వచ్చాయి. అతని గేమ్, సుధీర్ ను కాపాడిన పవర్, టాస్క్ లో దూకుడు అతనికి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. 2వ స్థానంలో దేబ్జానీ ఉంది. ఆమెకు 9.05% (10,521 ఓట్లు) వచ్చాయి. 3వ స్థానంలో వంశీ ఉన్నాడు. తగ్గించు - తప్పించు టాస్క్ లో గెలిచి ఫ్యామిలీ వీక్ + ఇమ్యూనిటీ కొట్టేసిన వంశీకి 8.6% (10,001 ఓట్లు) వచ్చాయి. 4వ స్థానంలో వర్షిణి 7.4% (8,607 ఓట్లు), 5వ స్థానంలో సుధీర్ 7.4% (8,605 ఓట్లు) - ఇద్దరి మధ్య కేవలం 2 ఓట్ల తేడా మాత్రమే ఉంది. 6వ స్థానంలో నీతూ 7.38% (8,584 ఓట్లు), 7వ స్థానంలో అమన్ 7.29% (8,470 ఓట్లు), 8వ స్థానంలో రామ్ ప్రసాద్ 7.21% (8,385 ఓట్లు), 9వ స్థానంలో నరేష్ 7.2% (8,374 ఓట్లు), 10వ స్థానంలో శివ్ కుమార్ 7.14% (8,298 ఓట్లు) ఉన్నారు.

అంటే బాటమ్ 3 లో శివ్ కుమార్, నరేష్, రామ్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా శివ్ కుమార్ సంచాలక్ గా చేసిన నిర్ణయాలు, నీతూతో గొడవ అతనికి మైనస్ అయ్యాయి. మరోవైపు టాప్ లో ఉన్న ముఖేష్ కు దాదాపు 3 రెట్లు ఎక్కువ ఓట్లు రావడం అందరిని షాక్ కు గురిచేస్తోంది. ముఖేష్ ను ఎలిమినేట్ చేయడం ఈ వారం కష్టమే అని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి వీక్ 9 ఓటింగ్ లో ముఖేష్ నెంబర్ 1 ఉండి సేఫ్ కాగా దేబ్జానీ, వంశీ సేఫ్ జోన్ లో ఉన్నారు.  శివ్ కుమార్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. మరి చివరి వరకు ఈ లెక్కలు ఇలాగే ఉంటాయా మారుతాయా చూడాలి మరి. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com