.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో రివార్డ్ అండ్ రివేంజ్ ప్రక్రియ సాగుతుంది. వచ్చే వారం హౌస్ లోకి హౌస్ మేట్స్ ఫ్యామిలీలు వస్తున్నాయి. దాని గురించి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఛాలెంజ్ 2 తగ్గించు అండ్ తప్పించు టాస్క్ లో వంశీ సంచలన విజయం సాధించాడు. ఈ టాస్క్ కు శివ్ కుమార్ సంచాలక్ గా వ్యవహరించాడు. బస్తాల్లో థర్మకోల్ పెట్టి, 8 ఆకారంలో బ్యాగ్ కాపాడుకునే ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. ఒకరినొకరు నెట్టుకుంటూ, బ్యాగ్ లాగేసుకుంటూ చివరి వరకు ఫైట్ చేశారు.
ఈ టాస్క్ లో ముందుగా మొదటగా నీతూ అవుట్ అయింది. ఆ తర్వాత దేబ్జానీ అవుట్ అవ్వగా కాసేపటికి సుధీర్ అవుట్ అయ్యాడు. మరికాసేపటికి ముఖేష్ అవుట్ అయ్యాడు. చివరకు వంశీ, అమన్ ల మధ్యే ఫైనల్ ఫైట్ జరిగింది. చివరి వరకు తన బ్యాగ్ ను కాపాడుకున్న వంశీ టాస్క్ గెలిచాడు. దీంతో వంశీకి ఫ్యామిలీ వీక్ + ఇమ్యూనిటీ రెండూ దక్కాయి. 10వ వారం ఫ్యామిలీ వీక్ లో తన కుటుంబ సభ్యులను కలిసే గోల్డెన్ ఛాన్స్ తో పాటు ఈ వారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.
మొత్తానికి ఛాలెంజ్ 1 లో శ్వేత గెలిచి ఫ్యామిలీ వీక్ దక్కించుకోగా, ఛాలెంజ్ 2 లో వంశీ గెలిచి ఫ్యామిలీ వీక్ + ఇమ్యూనిటీ కొట్టేశాడు. వంశీ గేమ్ ఇప్పుడు ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. మరి రాబోయే ఛాలెంజ్ లలో ఎవరు గెలుస్తారు? ఎవరికి ఫ్యామిలీ వీక్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.




.webp)
.webp)
