.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో తొమ్మిదవ వారం రివార్డ్ అండ్ రివేంజ్ థీమ్ తో బిగ్ బాస్ పెద్ద మెలిక పెట్టాడు. ఈ వారం టాస్కుల్లో గెలిచిన వాళ్లకు పదవ వారం ఫ్యామిలీ వీక్ లో తమ కుటుంబ సభ్యులను కలిసే ఛాన్స్ ఇస్తానని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. రివేంజ్ లో పడిన కంటెస్టెంట్ కు ఫ్యామిలీ రాదు, అంతేకాదు కెప్టెన్సీ రేసు నుంచి కూడా తప్పుకుంటాడు. దీంతో హౌస్ లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. మొదటి టాస్క్ లో సంచాలకులు ముకేష్, త్రిగుణ్ ఇద్దరూ ఓవర్ చేసి వేర్వేరు నిర్ణయాలు ప్రకటించడంతో బిగ్ బాస్ స్వయంగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
చివరకు ముఖేష్ టీమ్ విన్ అయిందని త్రిగుణ్ ఒప్పుకోవడంతో ముఖేష్ టీమ్ కి రివార్డ్ వచ్చింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు.
ముఖేష్ టీమ్ అంతా కలిసి డిస్కస్ చేసుకొని ఏ ఒక్కరు అవతలి టీమ్ లోని వేరొకరికి రివేంజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పండి అనడంతో అందరు కలిసి చీటీలలో వారి పేర్లు రాసుకొని తీస్తే అందులో శ్వేత పేరు ఉంటుంది. దాంతో శ్వేతని రివేంజ్ తీసుకోవాలని బిగ్ బాస్ ప్రకటించాడు. త్రిగుణ్ టీంలోని ఏ మెంబర్ కి రివేంజ్ ఇవ్వాలో డిసైడ్ చేశారు. రామకృష్ణ పేరుని తను చెప్పడంతో అతను ఇకనుండి కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకున్నట్టే.. పాపం రామకృష్ణ ఫ్యామిలీ నెక్ట్స్ వీక్ రాదు.
శ్వేత గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూనే టాస్కుల్లో బాగా ఆడుతోంది. అందుకే టీమ్ మొత్తం ఆమెకే రివార్డ్ ఇవ్వడం విశేషం.మొత్తానికి బిగ్ బాస్ పెట్టిన మెలికతో రామకృష్ణకు పెద్ద దెబ్బ తగిలింది. ఫ్యామిలీ వీక్ కు దూరం కావడం, కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవడం అతనికి మైనస్ కానుంది. మరోవైపు శ్వేతకు ఫ్యామిలీని కలిసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మరి రామకృష్ణ ఈ రివేంజ్ నుంచి బయటపడతాడా? లేక ఇదే అతని గేమ్ కు బ్రేక్ అవుతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తేలనుంది.




.webp)
.webp)
