
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం కెప్టెన్సీ టాస్క్‌లో నరేష్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అమన్, వంశీ, ఆర్కే, నరేష్‌లు రెండో లెవెల్‌కి వెళ్లారు. అక్కడ ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో నరేష్ ముందుకు వచ్చాడు. చివరగా డిసైడింగ్ ఓట్ త్రిగుణ్ దగ్గరకు వచ్చింది. త్రిగుణ్ మామూలుగా అయితే అమన్‌కి సపోర్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అక్కడ అందరినీ షాక్‌కి గురిచేస్తూ నరేష్‌కి అవకాశం ఇచ్చాడు.
నరేష్ ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు, అతని కెప్టెన్సీని చూడాలని అనుకుంటున్నానని త్రిగుణ్ చెప్పాడు. నరేష్ ఏమైనా తప్పులు చేస్తే మళ్లీ ప్రశ్నిస్తా అంటూనే, అమన్ సారీ రా అని చెప్పి మరీ నరేష్‌ని కెప్టెన్ చేశాడు. ఈ నిర్ణయం హౌస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. త్రిగుణ్, అమన్ ఫ్రెండ్షిప్ ఉన్నా, గేమ్ కోసం త్రిగుణ్ ఇలా నిర్ణయం తీసుకోవడం హైలైట్ అయింది. ఇదే సమయంలో శివ్ తన ఓటుని ఆర్కేకి కాకుండా అమన్‌కి వేశాడు. ఎందుకు అలా చేశావ్ అని ఆర్పీ అడిగితే శివ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నరేష్ కెప్టెన్ అవ్వాలని ముందే త్రిగుణ్ ప్లాన్ చేశాడు, అతని ప్లాన్ సక్సెస్ అవ్వొద్దు అని నా వంతుగా ట్రై చేశా అని చెప్పాడు. దీంతో త్రిగుణ్ ప్లాన్‌పై హౌస్‌లో చర్చ మొదలైంది.
మరోవైపు ప్రతీ శనివారం ఎపిసోడ్లో నాగార్జున ముందు త్రిగుణ్ ఎలా తన తప్పుల్ని ఒప్పుకుంటాడో రామ్ ప్రసాద్ ఇమిటేట్ చేసి చూపించాడు. అది చూసి నరేష్, దేబ్జానీ, వర్షిణి పగలబడి నవ్వేశారు. కెప్టెన్‌గా గెలిచిన నరేష్.. రామ్ ప్రసాద్, వంశీలకు కాయిన్స్ ఇచ్చాడు. మరి నరేష్ కెప్టెన్సీలో హౌస్ ఎలా నడుస్తుందో చూడాలి.






