ఈటీవీకి స్టార్ మాకి పోలిక పెట్టిన ఇమ్ము
on Apr 12, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ప్రోమో చూస్తే మొత్తం పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. అలాగే ఇందులో డైలాగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక ఇమ్ము చెప్పిన డైలాగ్ వింటే వామ్మో అనకుండా ఉండరు. ఇక అవినాష్ ఐతే కొంచెం ఎక్కువ చేసినట్టే అనిపించింది. పుష్ప లా గెటప్ వేసుకుని "నిన్ను చూస్తుంటే పీలింగ్స్ వస్తుండాయి వచ్చి ఇచ్చేది ముద్దు" అంటూ శ్రీముఖిని అడిగేసరికి "వాడే బెస్ట్ రా" అంటూ హరిని పొగిడేసింది. ఉగాది, శ్రీరామనవమి పండగలు ఐపోయాయి ఇప్పుడు పుష్ప పండగ మొదలయ్యింది. ఇంతలో కొంతమంది టీవీ స్టార్స్ వచ్చారు. "చాల రోజుల తర్వాత చెప్పారు పుష్పలో కూలోడు గెటప్ అంటే వెతుక్కుని వెతుక్కుని మరీ వేసుకొచ్చాను." అన్నాడు అమర్ దీప్..నార్మల్ గా వచ్చినా కూలోడి గానే ఉంటావ్ గా అని కౌంటర్ వేసాడు హరి.
ఆ తర్వాత ఇమ్ము గెటప్ చూసి నూకరాజు పెద్ద డైలాగ్ వేసాడు. రీసెంట్ గా ఈటీవీ నుంచి మా టీవీకి వచ్చిన విషయం తెలిసిందే. "అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చాలా మారావ్ మచ్చా నువ్వు" అన్నాడు నూకరాజు. "సరుకు అక్కడ అమ్మితే ఒక రేటు..ఇక్కడ అమ్మితే ఒక రేటు" అంటూ చెప్పాడు ఇమ్ము. దానికి అందరూ అరుస్తూ మరీ నవ్వేశారు. ఇక హరి కూడా అమర్ మీద ఇలాంటి జోక్స్ వేస్తూండేసరికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. "స్టార్ మా ఆర్టిస్టులకు ముందుగా రెస్పెక్ట్ ఇవ్వాలి...అమర్ వేరే ఛానల్ కి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ స్టార్ మా అంత జోక్ చేయకూడదు అమర్ మీద.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరిలో కొంతమంది అమ్మాయిలని వేరే భాషల వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను అచ్చ తెలుగు ఆడపడుచుల్లా మార్చి వాళ్లకు క్యూట్ బూతు మాటలు మాట్లాడించి ఫన్ క్రియేట్ చేశారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
