Karthika Deepam2: దశరథ్ ని కాల్చేసిన దీప.. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్!
on Apr 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-329 లో.. జ్యోత్స్న ప్లాన్ తెలుసుకున్న దీప ఆవేశంగా వస్తుంది. ఇక తనకోసం జ్యోత్స్న ఇంటి బయటే ఎదురు చూస్తుంది. తను రాగానే బాగా రెచ్చగొట్టి మాట్లాడుతుంది జ్యోత్స్న. నేను రెండు కుటుంబాలను కలుపుతాను.. బావతో నా పెళ్లి జరిగి తీరుగుతుంది. ఇది జరగాలంటే అడ్డుగా ఉంది నువ్వు నీ కూతురు కాబట్టి నిన్ను బతకనివ్వును.. నీ కూతుర్ని నమ్మను.. మీ ఇద్దరినీ చంపి మా బావ చేత తాళి కట్టించుకుంటానంటూ జ్యోత్స్న అంటుంది. దాంతో దీప లాగిపెట్టి కొడుతుంది. చంపుతానన్న మాట వచ్చిందంటే నేనే నిన్ను చంపుతానంటుంది దీప. నీకు మనిషిని చంపేంత ధైర్యం లేదు.. బావ కోసం చచ్చేంత ప్రేమ లేదు.. బావ కోసం నిన్ను నీ కూతుర్ని చంపేంత ప్రేమ నాకుందంటూ మళ్లీ జ్యోత్స్న రెచ్చగొడుతుంది. ఇద్దరు గొడవ పడుతుండగా ఇలానే ఆవేశంగా జ్యోత్స్న లోపలికి వస్తుంది.
దీప ఆవేశంగా కర్ర తీసుకుని లోపలికి వెళ్లి.. హేయ్ జ్యోత్స్నా రావే.. జ్యోత్స్నా బయటికి రా.. చంపుతా అన్నావ్‌గా భయమేసిందా.. రావే బయటికి అని పెద్దపెద్దగా అరుస్తుంటుంది. ఇక దీప అరవగా అరవగా జ్యోత్స్న వెనక్కి చేతులు పెట్టుకుని దీప దగ్గరకు వస్తుంది. ఇది కూడా జ్యోత్స్న ప్లానే. వెనుక నుంచి గన్ తీసి దీపకు చూపిస్తూ.. ఆ రోజు నిన్ను చంపుదామనుకున్న రోజు నీ తల మీద గురి పెట్టింది ఇదే గన్.. ఇది మా తాతది అంటూ జ్యోత్స్న చెబుతూ ఉంటుంది. అంతలో అక్కడికి దశరథ్, కాంచన, సుమిత్ర, శివన్నారాయణ వస్తారు.
ఇక వాళ్ళంతా రాగానే జ్యోత్స్న తన ఓవర్ యాక్టింగ్ మొదలెడుతుంది. మమ్మీ డాడీ కాపాడండి.. మీరే కాపాడాలి నన్ను దీప నన్ను చంపేస్తుందంటూ దీప అరుస్తుంది. పారిజాతం పోలీసులకు కాల్ చేయడానికి వెళ్తుంది. వద్దు వద్దు అంటూనే ఉంటారు అంతా దీపను. పారిజాతం పోలీసులకు కాల్ చేసి వచ్చి.. ఐదు నిమిషాల్లో పోలీసులు వస్తారని చెబుతూనే దీపకు దగ్గరకు వెళ్లబోతుంది. గ్రానీ వద్దు.. గన్ లోడ్ అయ్యి ఉంది.. దగ్గరకు వెళ్లకని పదే పదే అంటుంది జ్యోత్స్న. జెస్ట్ అలా గన్ పట్టుకుని బెదిరిస్తూ ఉంటుంది. గన్ పేలిపోతుంది. బుల్లెట్ వచ్చి దశరథ్ గుండెల్లో దిగిపోతుంది. అంతా షాక్ అయిపోతారు. దీప కూడా ఆశ్చర్యపోతుంది. అదే సమయానికి కార్తీక్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
