రోజాను ఆంటీ అన్న సుధీర్
on Apr 12, 2025
డ్రామా జూనియర్స్ ప్రతీ సీజన్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఈ షోలో ఒక చిన్నారి సోదెమ్మ వేషం వేసుకొచ్చి హోస్ట్ సుడిగాలి సుధీర్ కి సోది చెప్పింది. "ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా నేనే కనపడాలి..చుట్టూ ఎప్పుడూ పోలీసులు ఉండాలి" అని సుధీర్ అనేసరికి "బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయవయ్యా. నీ చుటూ పోలీసులే ఉంటారు. తర్వాత "నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను..ఆ అమ్మాయితో పెళ్లవుతుందా" అని సుధీర్ అడిగాడు. ఇక ఆ చిన్నారి సోదెమ్మ ఐతే "ఆ అమ్మాయికి తప్పకుండా పెళ్లవుతుందయ్యా" అంది వెంటనే జడ్జ్ రోజా వచ్చి "నీతో కాదు" అంది అంటే "అయ్యో ఐతే నాతో అవదా పెళ్లి" అన్నాడు. తర్వాత ఇంకో చిన్నారి వచ్చి స్కిట్ వేసింది. వెంటనే ఆ చిన్నారిని ఏ క్లాస్ అన్నాడు. 5th క్లాస్ అని చెప్పింది. అది విన్నాక నేను కూడా 5th క్లాస్ ఐతే అన్నాడు సుధీర్. దాంతో రోజా "నువ్వు 4th క్లాస్ అన్నట్టు గుర్తు సుధీర్" అంది. వెంటనే సుధీర్ "అది ఇందాక అన్నాను ఆంటీ" అని చెప్పాడు.
వెంటనే పక్కనే ఉన్న ఇంకో జడ్జ్ అనిల్ రావిపూడి "మిమ్మల్ని ఫ్లోలో ఆంటీ" అన్నాడు అనేసరికి రోజా ఒక్క చూపు చూసింది అంతే సుధీర్ తలా దించుకున్నాడు. తర్వాత లోహిత్ సాయి - రుత్విక్ అనే ఇద్దరు చిన్నారులు చేసిన కామెడీ వేరే లెవెల్ లో ఉంది. క్లాస్మేట్ రోజీ లవ్ లెటర్ ఇచ్చింది అని రుత్విక్ చెప్పేసరికి ఇంకో చిన్నారి లోహిత్ సాయి " నీకన్నీ మీ చిన్న మావయ్య సుధీర్ పోలికలు వచ్చాయేంటి" అంటూ సుధీర్ మీద జోక్స్ వేసాడు. "క్లాస్ లీడర్ గా ఆ రమేష్ గాడు నిల్చున్నాడు అందుకే ప్రెస్ మీట్ పెట్టి గోడవెట్టుకున్నా" అని రుత్విక్ అనేసరికి ఏంటి నీకు మీ నాయనమ్మ రోజా గారి పోలికలు వచ్చాయి అంటూ రోజాను చూపించేసరికి రోజా వేలు చూపించింది అంతే ఆ చిన్నారులిద్దరూ సైలెంట్ ఇపోయారు. ఇక ఇందులో స్కిట్స్ వేసిన పిల్లలు మాములుగా లేరు. కౌంటర్లు బాగా వేస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
