Karthika Deepam2 : బేబి వద్దని చెప్పమని శౌర్యకి నూరిపోసిన పారిజాతం!
on Dec 4, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -531 లో.. ఇంకా పని వాళ్ళు రాలేదని పారిజాతం గుమ్మం దగ్గర ఉండి తిట్టుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎందుకు లేట్ అయిందో కారణం ఉంటుందని అంటాడు. అదేదో చెప్పాలి కదా ఇంత వరకు కాఫీ తాగలేదని పారిజాతం అంటుంది. కార్తీక్ కి శివన్నారాయణ ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చెయ్యడు. దాంతో కాంచనకి ఫోన్ చేస్తాడు. కార్తీక్ ఇంకా లేవలేదు నాన్న.. రాత్రి దీపకి కడుపు నొప్పి అని ఇబ్బంది పడిందని చెప్తుంది.
ఆ తర్వాత శివన్నారాయణ వెళ్లి సుమిత్రని తీసుకొని రా అని పారిజాతానికి చెప్తాడు. ఆ తర్వాత అనసూయ దగ్గర శౌర్య జుట్టు వేసుకోకుండా మారాం చేస్తుంటుంది. దాంతో కాంచన వేస్తుంది. దీని అల్లరి తట్టుకోలేకపోతున్నాం.. ఎక్కడికైనా పంపించు అక్క అని అనసూయ అంటుంది. రాత్రి పారిజాతం అన్నమాటలు గుర్తుచేసుకొని.. రాత్రి మా పిన్ని ఫోన్ చేసిందని అనసూయకి కాంచన చెప్పబోతుంటే. పారిజాతం, శివన్నారాయణ, సుమిత్ర డాక్టర్ ఇంటికి వస్తారు. అప్పుడే కార్తీక్ నిద్ర లేచి హాల్లోకి వస్తాడు. అక్కడ డాక్టర్, శివన్నారాయణ ఉంటారు. డాక్టర్ ఏంటి తాత అని శివన్నారాయణ అడుగుతాడు. రాత్రి దీపకి కడుపునొప్పి అంట కదా అందుకే తీసుకొని వచ్చానని శివన్నారాయణ అంటాడు.
డాక్టర్ సుమిత్ర, పారిజాతం ముగ్గురు దీప దగ్గరికి వెళ్తారు. మళ్ళీ పారిజాతాన్ని డాక్టర్ బయటకు పంపిస్తుంది. ఎందుకు కడుపు నొప్పి లేసిందని అడుగగా.. శౌర్య కాలుతో తన్నిందని దీప చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి చెప్తుంది. నాకు తెలుసు అందుకే అక్కడ పడుకోకు అని చెప్పానని కాంచన అంటుంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండమని దీపకి డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య దగ్గరికి పారిజాతం వచ్చి.. నీకు చిన్న చెల్లి వస్తుంది. ఇక అందరి ప్రేమ తనపై ఉంటుంది. నిన్ను పట్టించుకోరు. నువు ఏం చెయ్యాలంటే ప్రతీదానికి అల్లరి చెయ్యాలి. బేబీ వద్దని చెప్పాలని పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



