Brahmamudi : అప్పు ఇన్వెస్టిగేషన్ ఓ వైపు.. రాహుల్ ప్లాన్ మరోవైపు!
on Dec 4, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -894 లో.....అప్పు పాప కేసు స్టడీ చేస్తుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు. ప్రకాష్ వచ్చి ఆ ఫైల్ ఏంటని అడుగుతాడు. ధాన్యలక్ష్మి వచ్చి ఫైల్ గురించే అడుగుతుంది. డైరెక్టర్ గారు ఒక కేసు చదివి స్టోరీ రాయమని ఇచ్చారు.. అదే ఇది అని కళ్యాణ్ కవర్ చేస్తాడు. మరి అప్పు ఏం చేస్తుందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇలాంటివి అప్పుకి బాగా తెలుసు కదా నాకు హెల్ప్ చెయ్యమన్నానని కళ్యాణ్ కవర్ చేస్తాడు.
మరోవైపు మేనేజర్ కి రాహుల్ ఫోన్ చేసి.. రాజ్ కంపెనీలోని నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి డిజైన్స్ తీసుకొని రమ్మని చెప్పమని చెప్తాడు. అప్పుడే రుద్రాణి వస్తుంది. ప్లాన్ ఏంటో రుద్రాణికి రాహుల్ చెప్తాడు. స్వప్నని ఆ డిజైన్స్ నేనే వేసానని నమ్మిస్తే చాలు.. తను మనకి సపోర్ట్ చేస్తుందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత సిరి వాళ్ళ అమ్మ రేణుక బయట కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే సిరి కూడా ఆడుకుంటుందని భ్రమ పడుతుంది. వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్లి సిరి అని మాట్లాడుతుంది. తీరా చూస్తే అక్కడ సిరి ఉండదు. దాంతో రేణుక లోపలికి వచ్చి అప్పుకి ఫోన్ చేసి.. మేడమ్ ఇందాక నా పాప కన్పించింది. నేను వెళ్లేసరికి లేదని చెప్తుంది. అవునా నేను వస్తున్నానని అప్పు చెప్తుంది.
ఇప్పుడు మనం ఎలాగైనా పాప వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందని కళ్యాణ్ తో అప్పు అంటుంది. అప్పుడే రాజ్, కావ్య కేరళకి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. అపర్ణని కావ్య హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. త్వరగానే వస్తారు కదా ఎందుకు బాధపడడం అని ఇందిరాదేవి అంటుంది. పదండి అన్నయ్య ఫ్లైట్ కి టైమ్ అవుతుందని రాజ్ కి సైగ చేస్తాడు కళ్యాణ్. నువ్వు ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నన్ను డ్రాప్ చేయడానికి అని రాజ్ చెప్తాడు. ఇక రాజ్, కావ్య, అప్పు, కళ్యాణ్ బయటకు వచ్చి మీరు వెళ్లిపోండి అని చెప్తాడు. అదేంట్రా అలా అన్నావ్.. డ్రాప్ చేస్తాను అన్నావని రాజ్ అనగానే వాళ్ళు కేసు గురించి బయటకు వెళ్ళడానికి మనల్ని వాడుకున్నారని కావ్య అంటుంది. ఒకేలే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



