Illu illalu pillalu : శ్రీవల్లి చేసిన పనికి తిరుపతికి శిక్ష.. ఒక్క ఛాన్స్ ఇచ్చారుగా!
on Dec 4, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో.... శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో తిరుపతి నగలు తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తాడు. ఎక్కడ నుండి వచ్చాయి రా నగలు అని రామరాజు అడుగగా ఎక్కడ నుండి వస్తే ఏంటి బావ.. వచ్చాయి కదా తీసుకోండి అని తిరుపతి అనగానే అతని చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. నిన్న అంత పెద్ద గొడవ అయిందని రామరాజు అంటాడు.
ఈ నగలు నా దగ్గరున్నాయి బావ.. పుట్టింటి నగలు అంటే ప్రేమకి ఇష్టం కదా అని తన బాధపడకుండా ఉండడానికి నా దగ్గర ఉంచానని తిరుపతి అంటాడు. ఆ తర్వాత సేనాపతి వాళ్ళకి నగలు ఇవ్వడానికి తిరుపతి వెళ్తాడు. అక్కడ తిరుపతిని సేనాపతి కొడతాడు. నగలు నువ్వే దాచి ఇదంతా యాక్టింగ్ చేసావని రామరాజుని సేనాపతి తిడతాడు. అదేం లేదు.. ఈ నగలు నా దగ్గరే ఉన్నాయని తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత నగలన్నీ ప్రేమకి ఇస్తుంది రేవతి. ఈ నగలన్నీ నీవి నీకే అధికారం ఉందని చెప్పి తన చేతిలో పెట్టి వెళ్తుంది.
ఆ తర్వాత ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని మా ఇంట్లో అడుగుపెట్టకని తిరుపతిని రామరాజు తిడుతాడు. మరొకవైపు శ్రీవల్లి దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. నువ్వు ఇంత చేసినా ఎందుకు వదిలేసామో తెలుసా.. ఒక్క ఛాన్స్ ఇద్దామని ఇకనైనా మారకపోతే నీ గురించి అందరికి చెప్పేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



