నువ్వేమైనా పెద్ద పిస్తావా.. నాగ్ దెబ్బకి ఆట సందీప్ బ్యాటరీ డౌన్!
on Sep 23, 2023

బిగ్ బాస్ సీజన్-7 శనివారం నాటి ప్రోమో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళంతా అనుకున్నట్టుగానే ప్రోమో అదిరింది. ఆట సందీప్ సంచాలక్ గా ఫేయిల్ అయ్యాడని నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. నీ పర్సనల్ గేమ్ ఆడుతున్నావా? బిగ్ బాస్ చెప్పాడని ఆడుతున్నావా? నువ్వేమైనా పెద్ద పిస్తావా అంటు నాగార్జున ఫైర్ అయ్యాడు.
శనివారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ భయమేస్తుంటుంది ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఇది అంటూ ఫైర్ అవుతాడు. మూడవ వారం హౌజ్ లో సీరియల్ బ్యాచ్ చేసిన పాలిటిక్స్ గురించి నాగార్జున చెప్తూ.. అమర్ దీప్ నీ గేమ్ నువ్వు ఆడకుండా ఎందుకని ప్రియాంక జైన్ ని గెలిపించడానికి ఆడుతున్నావ్? అసలు నీ గేమ్ ఉందా? అంటూ అమర్ దీప్ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. ఇక ప్రియాంక జైన్ అసలు నువ్వేం చేశావంటు కోప్పడ్డాడు. ప్రియాంక జైన్ అసలు నువ్వేం త్యాగం చేశావ్? ఏం పొడిచేశావ్ అంటూ తన మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. మొత్తం మీద ఈ సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
హౌజ్ మేట్ కోసం జరుగుతున్న పోటీలో యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు.. అతడు స్ట్రాంగ్ అని గేమ్ నుండి అనర్హుడిగా తీసేయడమేంటి, అసలు సంచాలకుడిగా నువ్వేం చేశావ్? శోభా శెట్టికి సపోర్ట్ గా మాట్లాడావ్? అంటూ నాగార్జున చెప్పగా అందరు మౌనంగా ఉండిపోయారు. ఇక ఆట సందీప్ కి ఇచ్చిన బ్యాటరీ పవర్ ని గ్రీన్ నుండి ఎల్లోకి తగ్గించేశాడు నాగార్జున. ఒక్కో కంటెస్టెంట్స్ యావర్ ని ఎలా టార్గెట్ చేసి తమ పాలిటిక్స్ చూపించారో వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక రతిక మధ్యలో తన ఒపీనియన్ అంటు గొడవని పెంచాలని చూసిందంటూ తన కోటా ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దామిణి పూర్ పర్ఫామెన్స్ ని చూసి ఏమని అంటాడో చూడాలి. కాగా తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



