గ్రాండ్ పేరెంట్స్ డేలో సన హడావిడి...
on Sep 23, 2023

బుల్లితెర సీరియల్స్ నటించే సీనియర్ నటి సన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె బుల్లితెర మీదే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తన మనవడు ప్రిన్స్ చదువుకునే స్కూల్లో జరిగిన గ్రాండ్ పేరెంట్స్ డేకి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. గ్రాండ్ పేరెంట్స్ డే అంటే కొంచెం టెన్షన్ గా ఉందని చెప్పింది. కానీ ఆ టెన్షన్ ని పక్కన పెట్టేసి మంచి గెటప్ లో స్కూల్ కి వెళ్ళింది. అక్కడ మిగతా గ్రాండ్ పేరెంట్స్ చేసిన డాన్సులను వీడియో తీసింది.
చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంది. వాళ్ళు తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ని చూసి వాళ్లందరికీ విషెస్ చెప్పింది. పిల్లలకు అక్కడి టీచర్స్ పెట్టిన గేమ్స్ ని చూసి ఆ మొత్తాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. అలాగే అక్కడి పిల్లలతో కలిసి ఫొటోస్ దిగింది అడిగిన వాళ్లకు సెల్ఫీలు ఇచ్చింది. ఇక ఇంటికి వచ్చేసరికి సమీరా చేస్తున్న క్యారెట్ కర్రీని కూడా వీడియో చేసి చూపించింది. ఇక "గువ్వా- గోరింకా" సీరియల్ షూటింగ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. అలాగే షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాక అక్కడ మేకప్ మెన్, హెయిర్ స్టైలిస్ట్ ని చూపించి వాళ్ళతో మాట్లాడింది. ఇక ఫైనల్ గా ఒక విషయం చెప్పింది "గీతాంజలి" అనే వెబ్ సిరీస్ చూడండి చాలా బాగుంది అంటూ తన ఫాన్స్ కి చెప్పింది. సన మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చాలా చేసింది. వాటికి మంచి పేరు కూడా వచ్చింది. అలాగే కొంతకాలం క్రితం ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అందులో సన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆలీ రెజాతో కలిసి ఒక రొమాంటిక్ సీన్‌లో నటించింది. ఐతే ఆ పాత్ర మీద చాలా విమర్శలు వచ్చాయి. ఐతే సీన్ డిమాండ్ చేసింది కాబట్టి అలా చేసినట్లు తర్వాత ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



