దామిణి ఈ వారం ఎలిమినేట్ పక్కానా?
on Sep 24, 2023
ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే దాదాపు ఎనభై శాతం మంది ప్రేక్షకులు దామిణి ఎలిమినేట్ అవుతుందనే చెప్తారు. దానికి బోలెడన్నీ కారణాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ నుండి మాట తీరు, ఆట తీరు అన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎవరు బాగా ఉండట్లేదని అడిగితే ఠక్కున దామిణి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే దామిణి ఆట సరిగ్గా ఆడటం లేదు. ఫేక్ అలిగేషన్స్ చేస్తూ అందరి దృష్టిలో బ్యాడ్ అవుతుంది దామిణి.
గతవారం నుండి మూడవ హౌజ్ మేట్ కోసం జరుగుతున్న పోటీలో బిగ్ బాస్ యావర్, అమర్ దీప్, శోభా శెట్టిని సెలెక్ట్ చేయగా.. యావర్ అనర్హుడని చెప్పింది దామిణి. తనకి అగ్రెషన్ ఉందని, కిచెన్ లో పార్టిసిపేషన్ లేదని, అందరితో కలవట్లేదని, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అని ఏవేవో చెప్పి రేస్ నుండి తప్పించేలా చెప్పింది దామిణి. అయితే బిగ్ బాస్ తను చెప్పింది రాంగ్ అని నిరూపిస్తూ యావర్ కి గంట సేపు టాస్క్ ఇచ్చాడు. అందులో యావర్ ని రిజెక్ట్ చేసిన దామిణి, రతిక, టేస్టీ తేజలని బిగ్ బాస్ టార్చర్ పెట్టమని చెప్పినప్పుడు.. పేడ నీళ్ళు, ఐస్ క్యూబ్స్, జండుబామ్ ఇలా అన్నింటిని యూజ్ చేసి దామిణి మరింత నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చుకుంది. అయితే హౌజ్ లో ఒక్క కిచెన్ ఏరియాలోని కన్పిస్తూ తనకి తానే 'నేనో వంటలక్క' లా అని బిరుదు పెట్టుకొని ఫేక్ ఎమోషన్స్ ని నటిస్తుందని ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది.
ఇక శని, ఆదివారాలలో హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడు దామిణి హాట్ షో మితిమీరీంది. దామిణి ట్యాలెంట్ చూపిస్తుందంట్టు ఇప్పటికే ట్రోల్స్ వస్తున్నాయి. అసలు దామిణి టాస్క్, గేమ్ లలో ఎక్కువగా కనిపించకపోవడం ఒకటైతే, కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టేలా మాట్లడటం మరో మైనస్.. అదే ఇప్పుడు బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల దృష్టిలో తనని వీక్ కంటెస్టెంట్ లిస్ట్ లో పడేసింది. దీంతో ఈసారి తను ఓటింగ్ లో చివర్లో ఉంది. శుభశ్రీ రాయగురు, దామిణి ఇద్దరికి ఓటింగ్ శాతం చాలా తక్కువగా పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉండగా దామిణి చివరి స్థానంలో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



