Karthika Deepam 2 : దీపపై కుటుంబమంతా కోపం పెంచుకునేలా చేసిన జ్యోత్స్న!
on Mar 30, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -318 లో... దీప దగ్గరికి సుమిత్ర వచ్చి బాధపడేలా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా కూడా నువ్వు అందరి ముందు గౌతమ్ ని కొట్టి తప్పు చేసావని కాంచన అంటుంది.
అవును దీప నువ్వు చేసింది తప్పే ఒక అమ్మాయిని మోసం చేసాడని ముందు నువ్వు నాకు చెప్పాలిసిందని కార్తీక్ అంటాడు. అప్పుడే ఇక రింగ్ తొడుగుతున్నాడు.. మరేం చెయ్యమంటారని దీప అంటుంది. రింగ్ తొడిగిన ఇంకా పెళ్లి మాత్రం అవ్వలేదు కదా ఒకవేళ పెళ్లి అయినా కూడా వేసిన ముళ్లు ఇప్పించే వాడిని అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అందరి ముందు నువ్వు మాటలు పడ్డావంటూ దీపతో కార్తీక్ అంటాడు. నీ ఆవేశం వల్ల చెడ్డోళ్ళకి మంచి జరిగింది.. మంచోళ్ళకి చెడు జరిగిందని దీపతో అనసూయ అంటుంది. దీప కుబేర్ ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు శ్రీధర్ డాన్స్ చేస్తూ ఇంట్లోకి వస్తుంటే.. ఏం జరిగింది ఇంత హ్యాపీగా ఉన్నారని కావేరి అంటుంది. ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందంటూ శ్రీధర్ జరిగింది అంతా కావేరికి చెప్తాడు. మరొక వైపు జ్యోత్స్న అందరిని తన మాయమాటలతో తనపై జాలి కలిగేలా దీపపై కోపం వచ్చేలా మాట్లాడుతుంటే.. అందరు దీపపై కోపం పెంచుకుంటారు. ఆ తర్వాత దీప బాధపడుతుంటే కార్తీక్ తనకి భోజనం తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



