Eto Vellipoindi Manasu : శ్రీవల్లిని దొంగని చేసిన రామలక్ష్మి.. సీతాకాంత్ కనిపెడతాడా!
on Mar 30, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -365 లో... ఏం చేసినా మైథిలి అని చెప్తున్న రామలక్ష్మి బయటపడడం లేదు. ఈ వారం రోజుల్లో రామలక్ష్మి తనంతట తానే బయటపడేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు.
మరొక వైపు శ్రీవల్లి రామ్ ని తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. మా రామ్ మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుంటే తీసుకొని వచ్చాను.. మా బావగారు చాలా బిజీగా ఉన్నారు.. అందుకే నేను తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. రామ్ డ్రాయింగ్ వేసుకుంటాడు. మీ ఇల్లు చూపించండి అని రామలక్ష్మిని శ్రీవల్లి అడుగుతుంది. అత్తయ్య ఏదో ప్లాన్ తోనే నిన్ను పంపించింది.. నీ సంగతి చెప్తానని రామలక్ష్మి మనసులో అనుకుటుంది.
ఇల్లు తిరిగి చూస్తూ మీ బెడ్ రూమ్ చూపించమని శ్రీవల్లి అడుగుతుంది. రామలక్ష్మి బెడ్ రూమ్ లోకి వెళ్తారు. వెక్కిళ్లు వచ్చినట్లు శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. దాంతో రామలక్ష్మి వాటర్ కోసం వెళ్తుంది. సీతా బావ గారికి సంబంధించినవి ఏమైనా ఉంటాయో అని శ్రీవల్లి రూమ్ మొత్తం వెతుకుతుంది. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు ఉన్న లాకెట్ శ్రీవల్లికి కప్ బోర్డు లో దొరుకుతుంది.
నాకు సీతా గారికి సంబంధించిన లాకెట్ ఒకవేళ శ్రీవల్లి చుస్తే ప్రాబ్లమ్ అవుతుందని రామలక్ష్మి వస్తుంది అప్పుడే శ్రీవల్లి లాకెట్ ఓపెన్ చెయ్యబోతుంటే రామలక్ష్మి వచ్చి ఆపుతుంది. మీరు దొంగతనం చెయ్యడానికి వచ్చారా అంటూ శ్రీవల్లిపై రామలక్ష్మి కోప్పడుతుంది. అదేంటీ నేనొక ప్లాన్ తో వస్తే వాళ్ళు నన్ను దొంగ అనుకుంటున్నారు ఏంటని శ్రీవల్లి అనుకుంటుంది. ఫణీంద్ర, సుశీల వాళ్ళు చూసి.. ఇదేం బుద్ది అని శ్రీవల్లిని తిడుతారు.
మరొకవైపు శ్రీవల్లి ఏదో సాధించుకొని వస్తుందని శ్రీలత రమ్య ఎదురుచూస్తుంటారు. ఇక శ్రీవల్లి ఇంటికి వస్తుంది. మనం రామలక్ష్మి అని కనిపెట్టలేం.. బావగారి వల్లే అవుతుందని శ్రీవల్లి చెప్తుంది. మరోవైపు ఆ శ్రీలత ఇప్పుడు కావాలనే నువ్వు బయటపడేలా చేస్తుంది.. జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మికి సలహా ఇస్తాడు ఫణీంద్ర. అప్పుడే రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి సీతాకాంత్ వస్తాడు. మేమ్ ఇంకోవారంలో లండన్ వెళ్లిపోతున్నామని ఫణీంద్ర చెప్పగానే.. అమ్మ నాకు ఇచ్చిన గడువు కూడా వారం రోజులే.. ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోనని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



