నా పెళ్లా.. అవదండి... అలియా భట్ నా క్రష్!
on Mar 30, 2025
విజె సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ కూల్ గా ఉండే వ్యక్తి. రీసెంట్ గా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాంటి సన్నీ చిట్ చాట్ లో కొన్ని సమాధానాలు ఇలా చెప్పాడు.
"నేను థియేటర్ ఆర్ట్స్ చేసాను. నా జర్నీ ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యింది. తర్వాత యాంకర్, సీరియల్ యాక్టర్ , బిగ్ బాస్, ఇప్పుడు మూవీస్ , వెబ్ సిరీస్ చేసాను. అలాగే నా లైఫ్ లో ఒక ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకున్నా..సెలూన్ బిజినెస్ స్టార్ట్ చేశా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసా. థియేటర్స్ చేసేటప్పుడు అల్లాఉద్దీన్ రోల్ చేసాను. ఇదొక బెస్ట్ మెమొరీ నా జీవితంలో..అది వన్ టైం షాట్. రవీంద్ర భారతిలో నా మొట్టమొదటి థియేటర్ ప్లే అది. ఫ్యూచర్ లో అలాంటి ఒక అడ్వెంచరస్ రోల్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. నా జీవితంలో ఒక కలర్ ఫుల్ డే కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను అక్కడ కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్న.
అలియా భట్ ఒక్కటే నా సెలెబ్రిటీ క్రష్. నా పెళ్లి ఇప్పుడు అవదండి..అవదు..ఇప్పట్లో అవదు..అది తెలీదు ఇంకా నాకు...కళ్యాణం వచ్చిన, కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. అలా వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. సహనం ఉంటె ఏమైనా చేయొచ్చు..చేస్తున్న హార్డ్ వర్క్ ఇంకా టైం రాలేదు అనుకుంటున్నాను. నేను నమ్మేది ఒక్క దేవుడినే..ఆయనే హనుమంతుడు ఆయన్నే నమ్ముతాను. రియలిస్టిక్ జానర్ మూవీస్ అంటే నాకు చాల ఇష్టం. పొజిషన్ తో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండడమే ఇష్టం. " అంటూ చెప్పుకొచ్చాడు విజె సన్నీ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
