Eto Vellipoyindhi Manasu : భార్య బర్త్ డే కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త!
on Nov 28, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -265 లో..... రామలక్ష్మి విడాకులు అడిగిందని లాగి పెట్టి కొట్టకుండా వారం రోజులు టైమ్ అడిగాడని శ్రీలతతో నందిని చెప్పగానే.. ఆ వారం రోజులు మనం యూజ్ చేసుకుని వాళ్ళని దగ్గర అవ్వకుండా చూడాలి. నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ పడకని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని పెద్దాయన, సిరి ఆలోచిస్తారు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు.
వదిన ఎందుకు ఆ నిర్ణయం తీసుకందని సిరి అడుగుతుంది. అంటే నిన్న కోపంలో తనని ఒక మాట అన్నాను.. అందుకే అనుకుంటా అని సీతాకాంత్ అంటాడు. అసలు శ్రీలత, రామలక్ష్మిలకి పడట్లేదని పెద్దాయన అనగానే.. అమ్మ నన్ను ఇంకా అమ్మ సవతి తల్లిలాగే చూస్తుందని రామలక్ష్మి అనుకుంటుందని సీతాకాంత్ అంటాడు. ఈ వారం రోజుల్లో ఆ ఆలోచన పోగొట్టి రామలక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టమో తెలియజేయ్యాలని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఆస్తి అంతా నీ పేరున రాయించకొని మంచి పని చేసావని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యానికి జరిగింది చెప్తుంది రామలక్ష్మి. ఈ నోటీసులపై లాయర్ నెంబర్ ఉంది. ఆ లాయర్ అడ్రెస్ కనుక్కో అలాగే శంకర్ అనే వ్యక్తి దగ్గర సందీప్ అప్పు చేసినట్టున్నాడు. అందుకోసమే సీతా సర్ ని ఎటాక్ చేసాడేమో.. అదంతా బయటపడుతుంది.. శంకర్ గురించి కనుక్కోమని రామలక్ష్మి చెప్పగానే.. మాణిక్యం సరే అంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మిని కొట్టి బావగారు విడాకులు ఇస్తారనుకుంటే ఇలా చేశారని శ్రీవల్లి అనగానే.. వాళ్లు కలవకుండా నేను చూసుకుంటానని శ్రీలత అంటుంది. ఒక వైపు రామలక్ష్మి మరొకవైపు సీతాకాంత్ లు తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి పడుకొని ఉంటుంది. సీతాకాంత్ బీరువా తీస్తుంటే అందులో బాక్స్ కింద పడుతుంది. ఏంటి అదని రామలక్ష్మి అనగానే.. నీ బర్త్డే కి గిఫ్ట్ ఇద్దామనుకున్నానని అనగానే రామలక్ష్మి ఓపెన్ చేస్తుంది. అందులో బ్యాంగిల్స్, పట్టీలు, నెక్లెస్, కుంకుమ ఉంటాయి. వాటిని చూసి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి తన చెయ్ పట్టుకొని ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



