Brahmamudi : అనామికకి చెంపదెబ్బ.. భార్యకి టిప్ ఇచ్చిన భర్త!
on Nov 28, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -579 లో.....ఇందిరాదేవి వంట చేస్తుంటే.. స్వప్న హెల్ప్ చేస్తుంది. ఇందిరాదేవి వంట చేస్తుంటే చెయ్ కాలుతుంది. దాంతో రాజ్ చూసి.. ఏంటి నానమ్మ నువ్వు ఎందుకు వంట చేస్తున్నావ్. నేను వద్దని చెప్పాను కదా అని అంటాడు. బయట ఫుడ్ మీ తాతయ్య తినడు అని ఇందిరాదేవి అంటుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు చెయ్యొచ్చు కదా అని రాజ్ అంటాడు. నాకు వంట రాదని రుద్రాణి అంటుంది. నువ్వు అయిన చెయ్యొచ్చు కదా పిన్ని.. నానమ్మ బాధ పడుతుంటే చూస్తున్నారని రాజ్ అడుగుతాడు.
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చేసినప్పుడు. ఎవరు నా కష్టం గుర్తించలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి రాజ్ కి ఎదురుమాట్లాడుతుంది. నువ్వు వెళ్లి కావ్య, అపర్ణలని తీసుకొని రా అప్పుడే ఈ ఇంటికి మంచిది అని సుభాష్ అంటాడు. అదేంటి అన్నయ్య ఇద్దరిని తీసుకొని రమ్మంటున్నాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడతాడు. నువ్వు మా ఇంట్లో వాళ్ళని నీ వైపు కి తిప్పకున్నావ్.. ఇప్పుడు మా అమ్మ నీ నీ దగ్గరికి రప్పించుకున్నావ్. ఇంట్లో నానమ్మ తాతయ్యని చూసుకునే వాళ్లు లేరు.. నానమ్మ వంట చేస్తూ చెయ్ కాల్చుకుందనగానే ఇప్పుడెలా ఉందని కావ్య అడుగుతుంటే.. అంత నటించకని రాజ్ అంటాడు. అప్పుడే అపర్ణ ఫోన్ తీసుకొని.. ఏంటో బాధ్యతగల భర్తలాగా దబాయిస్తున్నావని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అనామిక దగ్గరికి అప్పు కళ్యాణ్ ని తీసుకొని వచ్చి.. నా భర్తకి ఏ టాలెంట్ లేదన్నావ్ కదా తను పాటలు రాస్తుండు.. అవి జనాలకి నచ్చుతున్నాయి.. సక్సెస్ కి దగ్గర లో ఉన్నామని అనామికకి చెంప దెబ్బ కొట్టినట్లు మొహంపై చెప్పి వెళ్తుంది అప్పు.
ఆ తర్వాత కావ్య, ఇందిరాదేవి వాళ్ళకి క్యారెజ్ తీసుకొని వెళ్తుంది. ఎందుకు వద్దని అపర్ణ అంటుంది. అలా అయితే రాజ్ కి నీ విలువ ఎలా తెలుస్తుందని అంటుంది. అయిన కావ్య వినకుండా తీసుకొని వెళ్తుంది. రాజ్ ఎందుకు వచ్చవని అడుగుతాడు. నువ్వు వద్దని అనుకున్నావ్ కానీ మేమ్ కాదు అని సీతారామయ్య అంటాడు. తరువాయి భాగంలో కావ్య వంటలు.. మా ఇంట్లో బాగున్నాయన్నారు. అందుకే ఇదిగో టిప్పు అని కావ్యకి రాజ్ డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



