Karthika Deepam2 : కుబేర్ గురించి నిజం తెలుసుకున్న దాస్.. దీపకి నిజం తెలిసేనా!
on Nov 28, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -214 లో.....మన మనసులో తప్పు అభిప్రాయం లేదు.. శౌర్య అడిగిన ప్రతీది కాదంటే బాధపడుతుంది. అది మనల్ని కాకుండా ఎవరిని అడుగుతుందని కార్తీక్ అంటాడు. అనుబంధం ఏర్పడకపోయిన అనుబంధం ఏర్పడినట్లు చెయ్యాలి. ఉదాహరణకి రిసెప్షన్ లో నీ భుజం పై చేతులు వెయ్యడం లాంటివి. అలా తీసుకొని చొరవ అందరికి సమాధానం.. గది లోపల బయట మనం భార్యభర్తలమే మన దూరం మనకి తెలిస్తే చాలని కార్తీక్ అని వెళ్లిపోతాడు. మన బంధం అనుబంధంగా ఎప్పుడు మారుతుందో తెలియదు గానీ ఎప్పటికైనా మీ వాళ్ళతో మీరు కలిసి ఉండాలి. అప్పుడు కూడా మీ పక్కన చోటు ఇస్తే చాలు అని దీప అంటుంది.
మరొకవైపు జ్యోత్స్న రౌడీని కలవడానికి వస్తుంది. తనని దాస్ చూసి ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటాడు. మరొకవైపు శౌర్య గురించి డాక్టర్ తో కార్తీక్ మాట్లాడడం దీప వింటుంది. ఏమైంది శౌర్యకి అని అడుగగా.. ఏం లేదని కార్తీక్ అంటాడు. కార్తీక్ వాష్ రూమ్ కి వెళ్తాడు. కార్తీక్ ఫోన్ నుండి డాక్టర్ కి చేయాలని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను డాక్టర్ తో మాట్లాడాలని దీప అంటుంది. నా మీద నమ్మకం లేక చేస్తావా అని కార్తీక్ అనగానే వద్దు మీపై నమ్మకం ఉందని దీప అంటుంది. మరొకవైపు జ్యోత్స్న రౌడీ దగ్గరికి వెళ్తుంటే.. దాస్ వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అడుగుతాడు. నీకెందుకు నన్ను వదిలేయ్ అంటూ అనగానే.. దాస్ కిందపడతాడు. అప్పుడే కుబేర్ స్కెచ్ ఆర్ట్ కింద పడుతుంది. అది చూసి నువ్వు ఇతని డ్రాయింగ్ పట్టుకొని తిరుగుతున్నవ్ ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. నీకు ఇతను తెలుసా అని దాస్ అడుగుతాడు. తెలుసు దీప నాన్న, అనసూయ తమ్ముడు అని జ్యోత్స్న అనగానే.. దాస్ షాక్ అవుతాడు. అంటే అసలైన వారసురాలు దీపనా అని దాస్ అనుకుంటాడు. కుబేర్ కి ఇంకో కూతురు ఉండొచ్చు కదా ఏ విషయం అయిన అనసూయని అడగాలని దాస్ అనుకుంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా తాతయ్యకి ఫోన్ చెయ్యాలా అని దాస్ అనగానే.. జ్యోత్స్న వద్దని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
నా కూతురు ద్వారా నీ అసలు నిజం బయటపడిందని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత అమ్మ అంటు కార్తీక్ పిలుస్తాడు. కానీ కాంచన వెళ్ళదు.. నువ్వు వెళ్ళు దీప అని కాంచన అంటుంది. నేను ఎందుకు వెళ్ళాలని పిలుస్తుందని దీప అనుకొని.. మిమ్మల్నే అని అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి.. ఆ షర్ట్ కుట్టాలని చెప్తాడు. మీరు రాకుంటే నేను కుడతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



