ప్రెస్ మీట్ లో వాళ్ళిద్దరిని అలా చేయమని చెప్పిన దేవయాని!
on Mar 1, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-698లో.. తన గురించి, వసుధార గురించి చెడుగా మాట్లాడిన ఇద్దరు మేడమ్స్ ని రిషి డిస్ మిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు దేవయాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. "మా ఉద్యోగం ఊడిపోయింది" అంటూ తమ బాధని చెప్పుకుంటారు. ఇక దేవయాని వాళ్ళకి ఒక సలహా ఇస్తుంది. "కాలేజీలో కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది కదా? అప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చెయ్యండి.. రిషి సర్ మంచివాడే కానీ ఈ వసుధార వల్లే మా ఉద్యోగం పోయిందని చెప్పండి.. అప్పుడు అందరి ముందు వసుధార పరువుపోతుంది" అని వాళ్ళతో చెప్పగానే వాళ్ళు సరేనని అక్కడి నుండి కాలేజీకి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ధరణి.. వాళ్ళ మాటలు విని ఎలాగైనా వీళ్ళ గురించి రిషికి చెప్పాలనుకుంటుంది.
మరోవైపు రిషి క్యాబిన్ కి వసుధార వెళ్ళి.. "సర్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు.. ఇంటికి వెళ్ళలేదా? మీకు పూర్తిగా జ్వరం తగ్గలేదు" అంటూ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. వెళ్ళమని వసుధార అనగానే.. "ఏంటి ఆర్డర్ వేస్తున్నావ్" అని రిషి అంటాడు. రిషి సర్.. మీరు ఏమైనా అనుకోండి. ముందు అయితే వెళ్ళండని చెప్పి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.. ఇక రిషి బయల్దేరి వెళ్తుండగా జగతి మహేంద్రలు ఎదురు పడి ఎక్కడికి వెళ్తున్నావ్ రిషి అని అడుగుతారు. ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. మీటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో? లేవోనని వసుధారని ఫణీంద్ర అడిగి తెలుసుకుంటాడు.
మరోవైపు డిస్ మిస్ చేసిన మేడంలు వస్తారు. ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మేమే ఈ కాలేజీ పై కంప్లైంట్ ఇచ్చిందని అంటారు. వాళ్ళు అలా అనడంతో.. "మీరు ఈ కాలేజీ మీద కంప్లైంట్ ఇస్తారా? రిషి సారే.. మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ పేపర్ లో రాసిచ్చాడు" అని ప్రెస్ వాళ్ళు అంటారు. అది విని ఆ ఇద్దరు మేడమ్స్ షాక్ అవుతారు. దూరం నుండి జగతి, వసుధారలు వాళ్ళని చూస్తుంటారు. ఇక దేవయాని కాలేజీకి బయల్దేరి వస్తుంది. ఈ రోజు వసుధార పరువుపోతుందని అనుకుంటూ కాలేజీకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



