బైక్ డ్రైవింగ్ కూడా రాదా అన్న సౌమ్య!
on Mar 1, 2023

హోలీ పండగ వస్తున్న సందర్భంగా ఈటీవీలో ఒక స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. అదే "గుండెజారి గల్లంతయ్యిందే" అనే పేరుతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో బుల్లితెర నటులు, కమెడియన్స్ అందరూ వచ్చి మంచి పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని నవ్వించారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బైక్ సింగర్ రమణ, భాను వచ్చారు. రమణ తన సాంగ్ తో గతంలో ఒక ఎపిసోడ్ లో భానుకి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ అయ్యాక ఊరు వెళ్తే అక్కడ అంతా "భాను వదిన ఎక్కడ" అని బుర్ర తినేస్తున్నారు అని చెప్పాడు.
"ఈ హోలీ పండక్కి నిన్ను తీసుకొస్తానని వాళ్లందరికీ మాటిచ్చాను " అంటూ ప్రోమో స్టార్టింగ్ లో చెప్పాడు. తర్వాత డాక్టర్ బాబు, మానస్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. " మీరెందుకు లేటుగా వచ్చారు.." అని ఆది అడిగేసరికి "గూగుల్‌లో మ్యాప్ పెట్టాను.. మధ్యలో అది మిస్సయ్యింది" అని డాక్టర్ బాబు చెప్పేసరికి "మరేం చేశావ్" అని ఆది మళ్ళీ రివర్స్ లో అడిగాడు "ఏముంది ఇద్దరు గోకే వాళ్లు ఎక్కడ అని గూగుల్‌లో టైప్ చేశాను.. ఇక్కడికి తీసుకొచ్చింది" అని నిరుపమ్ పంచ్ వేసేసరికి ఆది చెవుల్లోంచి పొగలు బయటకి వచ్చాయి.. ఈ ఈవెంట్‌కు జడ్జిగా హీరోయిన్ జూనియర్ శ్రీదేవి వచ్చింది. తర్వాత మానస్ "ఎన్నో రాత్రులొస్తాయి గాని" అనే సాంగ్ కి చేసిన రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శ్రీదేవి ఫిదా ఐపోయింది. "మానస్ నీకు సాంగ్ ఇచ్చినా సినిమాలో చేసినట్టుగా చేస్తావ్" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.
ఆదికి యాంకర్ రవి ఒక బైక్ ఇచ్చాడు సౌమ్యను వెనక బైక్ మీద ఎక్కించుకుని ఇలా స్టేజి మీద ఒక రౌండ్ తిప్పాలి అనేసరికి ఆది కూడా వెనక సౌమ్యను ఎక్కించుకుని రెండు అడుగులు వేశాడో లేదో సౌమ్య బైక్ దిగిపోయి "నీకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, కామెడీ రాదు.. ఇప్పుడు బైక్ కూడా రాదా ?" అంటూ స్టేజి పైనే ఆది పరువు తీసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



