రాజ్ తో పాటు కావ్యకి మంగళస్నానం.. ఎమోషనల్ అయిన స్వప్న!
on Mar 1, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-31లో రాజ్ కి మంగళ స్నానం చేయిస్తుంటారు. అప్పుడే కావ్య బయటవైపు వెళ్తుంటుంది. అదే సమయంలో రాజ్ వాళ్ళ సర్వెంట్ గార్డెన్ లో చెట్లకి నీరు పడుతుండగా.. ఆ నీళ్లు కావ్యపై పడుతాయి. ఇక రాజ్ కి డాష్ ఇచ్చినప్పుడు పసుపు అంటుతుంది. అలా కావ్యకి కూడా మంగళస్నానం అయినట్లుగా చూపిస్తారు. ఇక రాజ్ ఫ్యామిలీ రెడీ అయి పెళ్ళి మండపానికి బయల్దేరుతుండగా.. రాజ్ వాళ్ళ నాన్న కి ఫోన్ వస్తుంది. రాజ్ అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు చనిపోయాడని చెప్పడంతో.. "పెళ్ళిలో నేను ఉండడం కంటే వాళ్ళని ఓదార్చడం ముఖ్యం.. మీరు వెళ్ళండి నేను అక్కడికి వెళ్తాను" అని రాజ్ తల్లి అంటుంది. నువ్వు వెళ్ళు మేము అంతా ఉన్నాం కదా.. రాజ్ పెళ్లి ఘనంగా జరిపిస్తామని రాజ్ నానమ్మ అంటుంది. రాజ్ ఫ్యామిలీ పెళ్ళి మండపానికి వెళ్తారు.
మరోవైపు కావ్య కొంత డబ్బు తీసుకొని వచ్చి కనకంకి ఖర్చులకి ఇస్తుంది. ఇక్కడ నన్ను రాజ్ చూస్తే గొడవ అవుతుంది. నేను అక్కని పెళ్లి కూతురిని చేశాక వెళ్ళిపోతానని కనకంతో కావ్య అంటుంది. అప్పు, కావ్య లు స్వప్నని రెడీ చేస్తారు. "ఏంటీ నిన్ను ఇంత రెడీ చేసినా పెళ్లి కళ రాలేదు" అని అప్పు అంటుంది. కాసేపు సరదాగా మాట్లాడుకొని.. ఇన్ని రోజులు మనం ఎన్ని గొడవలు పెట్టుకున్నా నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్లిపోతుంటే బాధేస్తుందే అంటూ అప్పు ఎమోషనల్ అవుతుంది. దాంతో స్వప్న కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పు, కావ్యలని పట్టుకొని ఏడుస్తూ.. "ఇక మనం కలవడం, మాట్లాడుకోవడం ఇదే ఆఖరిసారి కావొచ్చు" అని మనసులో అనుకుని ఏడుస్తుంది.
ఆ తర్వాత స్వప్నకి పెళ్ళి నుండి ఎవరికి తెలియకుండా ఎలా బయటకు రావాలో రాహుల్ చెప్తాడు. అందరూ రెడీ అయి పెళ్ళి మండపానికి వస్తారు. ఎవరికీ తెలియకుండా స్వప్న ఎలా పారిపోతుందో? రాజ్ కావ్యని ఎలా పెళ్ళి చేసుకుంటాడో? పెళ్లి టైంకి స్వప్న లేదన్న విషయం తెలిస్తే కనకం ఏం చేస్తుందో? ఈ సస్పెన్స్ రివీల్ కావాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



