Karthika Deepam2: దీప సొంతగూటికి చేరుతుందా.. జ్యోత్స్న టెన్షన్!
on Jan 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -571 లో.. జ్యోత్స్నని తీసుకొని కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. జ్యోత్స్నతో పాటు పారిజాతం కూడా వస్తుంది. ఏం టెస్ట్ లు అవసరం ఉన్నాయో అన్ని చేసేయండి డాక్టర్ అని కార్తీక్ చెప్తాడు. సరేనని డాక్టర్ అంటుంది. టెస్ట్ లు చేస్తే ఎక్కడ నేను వారసురాలిని కాదన్న విషయం బయటపడుతుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఈ రోజు నేను సాంపిల్స్ ఇవ్వలేను డాక్టర్ అని జ్యోత్స్న అంటుంది. ఏంటి ప్రాబ్లమ్ అని డాక్టర్ అడుగుతుంది అంటే కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ హాస్పిటల్ వాతావరణం నాకు పడదని జ్యోత్స్న అంటుంది. ముందు ఈ దాస్ గాడికి ఫోన్ చేసి అసలైనా వారసురాలు దొరికిందో లేదో కనుక్కోవాలని పారిజాతం బయటకు వెళ్లి దాస్ కి ఫోన్ చేస్తుంది. దాస్ లిఫ్ట్ చెయ్యడు. ఫోన్ రౌడీల దగ్గర ఉంటుంది.
అ తర్వాత ఎందుకు జ్యోత్స్న భయం అని కార్తీక్ అంటాడు. బావ నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ మీరు వెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది. మరొకవైపు శివన్నారాయణ బాధపడుతుంటే సుమిత్ర అమ్మకి ఏం కాదు పెద్దయ్యగారు అని దీప ధైర్యం చెప్తుంది. సుమిత్రని అమ్మ అంటున్నావ్ నన్ను పెద్దయ్య అంటున్నావ్.. నన్ను తాతయ్య అని పిలవొచ్చు కదా అని శివన్నారాయణ అనగానే అలాగే తాతయ్య అని దీప అంటుంది. సుమిత్ర గురించి నాకు భయంగా ఉంది. ఒకసారి స్వామిని ఇంటికి రమ్మని అంటానని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు పారిజాతం దగ్గరికి కార్తీక్ వస్తాడు. ఏంటి పారు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి జ్యోత్స్న టెస్ట్ లకి ఒప్పుకోవడం లేదని చెప్తుంది. జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. నువ్వు ఇప్పుడు సాంపిల్స్ ఇవ్వకపోతే తాతని రమ్మంటానని కార్తీక్ అనగానే సరే అని జ్యోత్స్న ఒప్పుకుంటుంది. దాంతో జ్యోత్స్నని టెస్ట్ లకి తీసుకొని వెళ్తారు.
అ తర్వాత శివన్నారాయణ దగ్గరికి స్వామి వస్తాడు. ఆ రోజు పూర్ణాహుతి కింద పడకుండా దీప కాపాడింది కాబట్టే సమస్యకి పరిష్కారం దొరికిందని స్వామి అంటాడు. అసలు అరిష్టం మొదలైందే తన వల్ల అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. సమస్య పరిష్కారం అవుతుందని స్వామి చెప్తాడు. మీరు మొహం చూసి జాతకం చెప్తారు కదా జ్యోత్స్న గురించి చెప్పండి అని కార్తీక్ అనగానే.. ముందు ముందు చాలా సమస్యలు రాబోతున్నాయని స్వామి చెప్తాడు. నా భార్య దీప గురించి చెప్పండి అని కార్తీక్ అంటాడు. దీప సొంతగూటికి చేరుతుందని స్వామి చెప్పగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. సొంతగూడు అంటే పుట్టిళ్లు.. అది దీపకి లేదుగా అని పారిజాతం అంటుంది. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని చెప్పి స్వామి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



