Jayam serial : ఇషికకి చెంపదెబ్బ.. గంగ, రుద్రలని వెంబడిస్తున్న వీరు!
on Jan 20, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -172 లో.... గంగ పెట్టిన డబ్బు కనిపించడం లేదని ఇంట్లో వాళ్లకు చెప్తుంది. జాగ్రత్తగా పెట్టాల్సిన డబ్బు అలా నెగ్లెట్ చేస్తే ఎలా అని ఇషిక అంటుంది. నేను అంత వెతికానని గంగ అంటుంది. అయితే మీ అమ్మ వాళ్ల బ్యాగ్ చూడాల్సిందేనని ఇషిక అనగానే వద్దని పెద్దసారు కోప్పడుతాడు. ఇషిక నువ్వు వెళ్లి చూడమని శకుంతల అంటుంది. ఇషిక చూడబోతుంటే.. ఆగు ఇషిక అని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. నాకు అవసరం ఉండి నేనే డబ్బు తీసుకున్నానని రుద్ర అనగానే ఇషిక షాక్ అవుతుంది.
వచ్చిన ప్రతిసారీ ఇలాగే అవమానం జరుగుతుందని అనుకొని పైడిరాజు, లక్ష్మీ వెళ్ళిపోతారు. అనవసరంగా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని శకుంతలతో పెద్దసారు అంటాడు. అవసరం బట్టి చెయ్యాల్సి ఉంటుందని శకుంతల అంటుంది. ఆ తర్వాత నేను తీసిన డబ్బు రుద్ర బావ తీసాడని అంటున్నాడు ఏంటని ఇషిక మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇషిక దగ్గరికి సూర్య వచ్చి.. నువ్వు దొంగతనం చేసిన డబ్బు ఎక్కడికి పోయిందని అనుకుంటున్నావా అని సూర్య అడుగుతాడు. దొంగతనం ఏంటని ఇషిక అనగానే.. రాత్రి నువ్వు డబ్బు తీసి వాళ్ళ బ్యాగ్ లో వెయ్యడం..నేను చూసానని ఇషిక చెంపచెల్లుమనిపిస్తాడు సూర్య. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటని సూర్య అనగానే బస్తీ అమ్మాయి నాకు సమానంగా ఉండడం ఇష్టం లేదని ఇషిక అంటుంది. నువ్వు డబ్బు తీసినట్లు అన్నయ్యకి చెప్తే ఏం అన్నాడో తెలుసా.. ఏదో జెలస్ ఫీల్ తో చేసినట్లు ఉంది సర్ది చెప్పు అన్నాడని ఇషికకి సూర్య వార్నింగ్ ఇస్తాడు.
మరొకవైపు లక్ష్మి వాళ్ళు వెళ్తుంటే.. విభూది బాబా గురించి తెలుస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి గంగ గురించి అడుగుతారు. మనిషి వస్తేనే చెప్తానని విభూది బాబా అనగానే గంగకి ఫోన్ చేస్తుంది లక్ష్మీ. ఇక విభూది బాబా గురించి గంగకి చెప్తుంది. విభూది బాబా వారు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపిస్తారు అంట.. మీ అత్తయ్యకి నీపై కోపం పోయి మంచిగా ఉండేలా పరిష్కారం చెప్తారని లక్ష్మీ అనగానే గంగ సరే అంటుంది. అదే విషయం రుద్రతో గంగ చెప్తుంది. మొదట వద్దన్నా గంగ అలిగిందని వెళదామని రుద్ర అంటాడు. ఆ మాటలు వీరు విని.. వాళ్ళని ఫాలో అవుతారు. ఇక దారి మధ్యలో గంగ, రుద్ర ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి ఐస్ క్రీమ్ తింటు ఉంటారు. అది చూసి వీరు.. వీళ్ళేంటి ఇక్కడ ఆగి ఐస్ క్రీం తింటున్నారని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



