Illu illalu pillalu : భాగ్యం, శ్రీవల్లిల ప్లాన్ ఫెయిల్.. ఎంగేజ్ మెంట్ సక్సెస్!
on Jan 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -371 లో.. అమూల్య ఎంగేజ్ మెంట్ ఎలాగైనా అపాలని శ్రీవల్లి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం అవుతుంది. దాంతో విసుగు వచ్చి ఎలాగైనా మీరే ఆపుకోండి అని అమూల్య, విశ్వ ఉన్న ఫొటోస్ భాగ్యంకి ఇచ్చి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆనందరావు వస్తాడు. ఏం చెయ్యాలని అంటాడు. ఈ ఫొటోస్ అందరు చూసేలా చేసి ఎంగేజ్ మెంట్ ఆగేలా చెయ్యాలని భాగ్యం అంటుంది. అదేంతా పని ఆనందరావు అంటాడు. అప్పుడే కామాక్షి బ్యాగ్ తిరుపతి ఓపెన్ చేసి మా బావ ఇంటిని గుల్ల చేస్తుందని కామాక్షి దాచుకున్న వస్తువులు తీసి సూటు కేసుని పక్కన నెడుతాడు.
అ సూట్ కేసు ఆనందరావుకి తగిలి ఫొటోస్ అన్ని కింద పడిపోతాయ్ అ ఫొటోస్ ని కామాక్షి పిల్లలు పట్టుకొని ఆడుతారు. వాటిని ప్రేమ చూసి పిల్లల దగ్గర నుండి తీసుకోవాలని ట్రై చేస్తుంది. అప్పుడే ధీరజ్ ఎదరుపడుతాడు. మళ్ళీ ఇద్దరికి గోడవ అవుతుంది. ఆ తర్వాతర్వాత నర్మద వస్తుంది. ప్రేమ ఫొటోస్ గురించి చెప్తుంది. పిల్లలు ఆడుతు పడిపోతారు. ఆ ఫొటోస్ ఎంగేజ్ మెంట్ దగ్గర పడుతాయి. దాంతో శ్రీవల్లికి ఫ్యాన్ వెయ్యమని సైగ చేస్తుంది భాగ్యం. ఇక శ్రీవల్లి ఫ్యాన్ వెయ్యగానే ఫొటోస్ రివర్స్ అవుతాయి. అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకుంటారు. ఫొటోస్ పై నర్మద స్వీట్ ప్లేట్ పెట్టి కవర్ చేస్తుంది. స్వీట్ ప్లేట్ తీసి ఫొటోస్ ప్రేమకి ఇస్తుంది. అదంతా చూస్తున్న భాగ్యం డిస్సపాయింట్ అవుతుంది. ఇరు కుటుంబాలు తాంబులాలు మార్చుకుంటారు.
అందరు చాలా హ్యాపీగా ఉంటారు. డ్యాన్స్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ అమ్మ రామరాజుకి ఇరవై లక్షలు ఇచ్చి.. నా కోడలికి నగలు కొనండి అంటుంది. రామరాజు వద్దంటున్న కూడా అబ్బాయి వాళ్ళ అమ్మ వనజ ఇస్తుంది. ఆ తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్తుంటే బయటవరకు వస్తారు. అదంతా పైనుండి విశ్వ, భద్రవతి చూస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



