సూసైడ్ చేసుకోవాలనుకున్న డాన్స్ మాస్టర్
on Nov 28, 2024
మణికంఠ మాష్టర్ అంటే ఢీ షో ఒక మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. వచ్చామా డాన్స్ చేశామా వెళ్ళిపోయాము అన్నట్టుగా తన పని తానూ చూసుకునే మణికంఠ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "మా కుటుంబంలో అన్నీ మా అన్నయ్య , వదిన చూసుకునే వారు. ఐతే మా వదిన చనిపోయారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో పాప ఉదయం, వదిన సాయంత్రం చనిపోయారు. తర్వాత మూడు నెలలకు రోడ్ యాక్సిడెంట్ లో మా అన్నయ్య చనిపోయారు.
ఐతే ఈ విషయాలు ఎక్కువగా ఎవరికీ చెప్పను. ఎందుకంటే వాళ్ళు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను... అంటే అందరికీ తెలియాలి అని. నేనేమో డాన్స్ పేరుతో అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని. ఇక మా అమ్మ కూడా చనిపోయింది అని తెలిసాక నా మైండ్ అంతా ఏదోలా ఐపోయింది. ఆ టైంలో నేను ఎవరి దగ్గర పని చేసానో వాళ్ళు కూడా నాకు పని ఇవ్వలేదు. దాంతో ఎం చేయాలో తెలీక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా. ఇక ఆ టైములో నన్ను చేరదీసిన మా రేవతి మేడం, ఆనంద్ సర్ నన్ను తిట్టి జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పి నా మైండ్ మార్చారు. కష్టం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు అని చెప్తున్నా. నిజంగా ఆ స్ట్రెస్ లో డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుని ఉంటె గనక ఈరోజు మీ అందరి ముందు ఉండేవాడిని కాదు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కునే ధైర్యం అందరిలో రావాలని అనుకుంటున్నా. నాలాగా ఎవరూ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని కోరుతున్నా. అందరూ నన్ను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ లా ఉన్నారు అని అనేవారు. ఆ మాట విన్నప్పుడు నాలో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. అలాగే అందరూ నన్ను జూనియర్ లారెన్స్ అంటారు. ఐతే ఆ పేరును ఢీ షోలో ప్రియమణి గారు పెట్టారు. లారెన్స్ గారు ఎవరికీ తెలీకుండా ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. నాకు కూడా అది ఇష్టం. అందుకే నాకు ఎంత తోచితే అంత ఎవరికీ తెలియకుండా సాయం చేస్తూ ఉంటాను" అని డాన్స్ కొరియోగ్రాఫర్ మణికంఠ చెప్పారు.