అఖిల్ సార్థక్ ఎమోషనల్ పోస్ట్.. ఆమె గురించేనా?
on Jan 5, 2024
.webp)
అఖిల్ సార్ధక్ ఇప్పుడు సోషల్ మీడియాలఫ డిఫరెంట్ పోస్ట్ లతో ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుంటున్న మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్. ఇతను బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్న ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్ తో జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయిన కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.
బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రతీ ఎపిసోడ్ ని ఫాలో అవుతూ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ ప్రశాంత్ కి అన్యాయం జరుగుతుందని పోస్ట్ లు చేశాడు. సెలబ్రిటీలంతా ఒకవైపు ఉండి ఒక కామన్ మ్యాన్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటు చెప్పిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ని కలిసాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. అది తనకి ఇష్టమైన మోనాల్ గురించేనా అనే వార్తలు వస్తున్నాయి. మరి అతను ఎవరి గురించి రాసాడో తెలియాల్సి ఉంది.
అఖిల్ సార్థక్ రాసిన ఆ పోస్ట్ లో ఏం ఉందంటే.. నేను చాలామందిని చూసాను. ఈ రోజుల్లో ఎవరు సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉండటం లేదు. ప్రతీఒక్కరు కొంతసమయం వరకు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతున్నారు. మా తల్లిదండ్రుల జనరేషన్ బాగుండేది. వాళ్ళు ఎలా కలిసి ఉండేవారని నేను ఇప్పటికి ఆశ్చర్యపోతున్నాను. 90's కిడ్ గా నేను ఓల్డ్ ఫ్యాషన్ ని ఓల్డ్ థింకింగ్ చేస్తున్నానని అనిపిస్తుంది కానీ ఈతరంలో ఎవరు వర్త్ కాదని అనిపిస్తోంది. టెక్నాలజీ మారడంతో ప్రతీది వరెస్ట్ గా మారింది. పెళ్ళి అనేది సింపుల్ గా డైవర్స్ గా ముగుస్తుంది. లవ్ ఈజ్ జీరో.. నేను ఈ జనరేషన్ ని తల్చుకొని బాధపడుతున్నాను. ఓల్డెన్ డేస్ లో పెళ్ళి చేసుకున్నాక భార్యభర్తల మధ్య ఏం అయిన సమస్య వస్తే పెద్దవాళ్ళు, రిలేటివ్స్ కలిసి కలిపేవారు. కానీ ఇప్పుడు రిలేటివ్స్ కలిసి ఇద్దరిని విడగొడుతున్నారు. ఇది చాలా దారుణమంటూ అఖిల్ సార్థక్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



