ఏపీకి సీఎం అయ్యి..పేదలకు సేవ చేయాలని ఉంది : జానీ మాష్టర్...
on Jan 5, 2024

నెల్లూరుకు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ.. జనసేన టికెట్ రేసులో ఉన్నట్టు ఒక న్యూస్ వైరల్ అయ్యింది. జనసేన నేతలతో కలసి హరిరామజోగయ్యను పాలకొల్లులో ఆయన నివాసంలో కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు జానీ మాష్టర్. ప్రస్తుతానికి ఆయన జనసేన టికెట్ పై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఐతే ఒక ఇంటర్వ్యూలో మాత్రం తనకు ఏపీకి సీఎం కావాలనే కోరుకుంటున్నట్టు చెప్పారు. "ఒక్కడు మూవీలా సినిమాల్లో సీఎం కావడం ఈజీ కానీ రియల్ లైఫ్ లో చాలా కష్టాలు ఉంటాయి. కులం లేదు అనుకుంటారు కానీ అదే ప్రధాన పాత్ర పోషిస్తుంది" అని అడిగిన ప్రశ్న జానీ మాష్టర్ తెలివిగా ఆన్సర్ చేశారు .."కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది.
నేను తిరిగిన సొసైటీలో అన్ని కులాల వాళ్ళతో కలిసి ఉన్నాను..వాళ్ళ ఇళ్లల్లో భోజనాలు చేసాను. వాళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు. నన్ను పెంచిన వాళ్ళ ప్రేమ చాలా గొప్పది" అని చెప్పారు. "ఐతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఉంది..అదేంటంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి పార్ట్ టైంలా వస్తారు వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోతారు..మరి మీరు అలా కాదు కదా" అన్న ప్రశ్నకు "టికెట్ కంఫర్మ్ అయింది...మీరు ప్రత్యక్ష రాజకీయాలలోకి రండి అని చెప్తే మాత్రం నేను వచ్చేస్తాను తిరిగి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు." అని చెప్పాడు జానీ మాష్టర్...ఇక ఈ ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ అన్నా, ఏపీ సీఎం జగన్ అన్న చాల ఇష్టం అని..ఇద్దరూ తల్లితండ్రుల్లాంటి వాళ్ళు అని ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం ఇష్టం అని తన చిన్నప్పటి నుంచి ఎంతో పేదరికాన్ని చూశానని చెప్పారు జానీ మాష్టర్...చదువు మధ్యలో ఆపేసి బేల్దార్ పని, కాటి కాపరి, లారీ మెకానిక్, లారీ బోర్ మెకానిక్, బీడీలు చుట్టే పని, బిస్కెట్ ప్యాకెట్ల ప్యాకింగ్ ఇలా రకరకాల జాబ్స్ చేసి చివరికి తన ఇంత జీవితంలో చూసిన ఎంతో మంది పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



