ఆయన ఒక్క చిన్న విషయం కూడా మర్చిపోలేదు
on Jan 5, 2024
.webp)
బిగ్ బాస్-6 లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ ఆ సీజన్ లో టాప్ సెలెబ్రిటీగా ఆడియెన్స్ మనసులకు బాగా దగ్గరయ్యింది. ఆమె పలు తెలుగు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సొంత కూతురన్నట్టుగా మారింది. 'కార్తీక దీపం' సీరియల్‌లో హిమ అనే అమాయకపు అమ్మాయి పాత్ర పోషిస్తుంది. ఆమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ నాగార్జునని కలిసిన పిక్ కూడా పోస్ట్ చేసింది. "చాలా కాలం తర్వాత నేను నా ఇష్టమైన వ్యక్తిని కలుసుకున్నాను..
అతను మాట్లాడిన విధానం నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూసి షాకయ్యాను. ఆయన ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను..ఈరోజును ఎంతో ప్రత్యేకమైనదిగా చేసిన నాగార్జున సర్ కి లాట్స్ ఆఫ్ లవ్" అని కామెంట్ పెట్టింది. అలాగే తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ కూడా నాగార్జునను కలిశారు. "సార్ స్వచ్ఛమైన ప్రేమతో కీర్తిని ఆదరించిన తీరు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను నిన్నెలా మర్చిపోతాను మా అంటూ ఆయన పలకరించిన విధానం చాల నచ్చింది. నాగ్ సర్‌ని కీర్తిని చిన్నపిల్లలా చాలా గట్టిగా హగ్ చేసుకోవడం నాకు చాల సంతోషంగా అనిపించింది" అని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో కీర్తిని హౌస్ మేట్స్ అంతా కూడా ఆదరించిన విషయం తెలిసిందే. ఇక కీర్తి భట్, విజయ్ కార్తీక్ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి సంబందించిన వారే కావడంతో అభిమానులు కూడా వీళ్ళ ప్రేమకు ఫిదా ఇపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



