పుష్ప 10 లో అనసూయ...మీవి ఫ్యామిలీస్ కానీ మావి కావా..రాజుకి వార్నింగ్
on Apr 17, 2025
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వీక్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ షోలో జడ్జ్ అనసూయ మాత్రం ఇమ్మానుయేల్ కి అలాగే యాదమ్మ రాజుకి గట్టిగా ఇచ్చి పడేసింది. యాదమ్మ రాజు ఈ షోకి చిలక జోస్యం చెప్పేవాడిలా వచ్చాడు. శ్రీముఖి వెంటనే అనసూయ జాతకం చెప్పు అంటూ ఆమెను స్టేజి మీదకు పిలిచింది. దాంతో ఇమ్ము, రాజు ముందు భయపడతారు. తర్వాత ఆమె చెయ్యి చూపించేసరికి జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "ఈ షో అయ్యేలోపు ఎవరినో గట్టిగా కొడతారు అనిపిస్తోంది. అలాగే పుష్ప 10 లో మీరు ఉంటారు.
అప్పటికి దాక్షాయణి శ్రీవల్లి అవుతుంది. కెరీర్ ని పక్కన పెట్టి పర్సనల్ విషయానికి వస్తే మళ్ళీ ఎవరో ఒకరిని గట్టిగా కొడతారు మేడం " అన్నాడు రాజు. దాంతో అనసూయకు మండిపోయింది. "అక్కడ దాకా ఎందుకు నిన్నే కొడతా. మీ ఇష్టమొచ్చింది మీరు అనేస్తే మేము హిహి అనుకుని వెళ్లిపోవాలా. సందు దొరికితే అమ్మాయిలకు ఏదో ఒక పేరు పెట్టి ఇన్సల్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఏదైనా ఫన్ తోనే స్టార్ట్ అవుతుంది. దాన్ని నార్మలైజ్ చేస్తారు అదే కంటిన్యూ అవుతుంది. నా పర్సనల్స్ గురించి మాట్లాడమంటారు మీ పర్సొనల్స్ గురించి మాట్లాడితే బాగుంటుందా.. మీ స్టెల్లాకు సంబంధించి ఇబ్బందికర పదాలు వాడితే నీకు నచ్చుతుందా.. నచ్చదు కదా మరి మీవి ఫామిలీస్ కానీ మావి కావా ..." అని అనసూయ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే శేఖర్ మాష్టర్ కూడా "మీరు లేడీస్ విషయంలో లైన్ క్రాస్ చేశారు" అన్నాడు. ఇక రోహిణి ఐతే "ఫన్ కోసం లైన్ క్రాస్ చేయక్కర్లేదు. హరి చెప్తాడు కానీ ఏది మంచో ఏది చెడో ఆర్టిస్ట్ కి తెలియాలి కదా" అంటూ క్లాస్ పీకింది. ఇక ఫైనల్ గా అనసూయ నవ్వేసి ఇది ప్రాంక్ అంటూ రాజునూ కూల్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



