"దబిడి దబిడి" సాంగ్ కి డాన్స్ చేస్తూ కాలు ఫ్రాక్చర్
on Apr 17, 2025
.webp)
ఒకప్పటి టాప్ యాంకర్ శిల్ప చక్రవర్తి గురించి అందరికీ తెలుసు. ఆమె యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి శిల్ప రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమెకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో కూడా ఆమె తన ప్రతీ వీడియొలో చెప్తుంది. అలా డాన్స్ చేస్తూ ఆమె తన కాలు విరగ్గొట్టుకుంది. ఇప్పుడు చాలా బాధపడుతోంది. ఇంతకు ఏమయ్యింది. "ఒక కామెడీ షోలో డాన్స్ చేయడం కోసం వాళ్ళు నన్ను పిలిచారు. ప్రతీసారీ పిలుస్తారు. బేసిక్ గా నేను డాన్సర్ ని . నేను స్టేజి మీద డాన్స్ చేస్తున్నప్పుడే జెమినీ టీవీ వాళ్ళు నన్ను చూసి బాగా డాన్స్ చేస్తున్నారు యాంకరింగ్ చేస్తారా అని అడిగారు. అలా నేను యాకరింగ్ చేయడం స్టార్ట్ చేశా .
నా కెరీర్ డాన్స్ తోనే స్టార్ట్ అయ్యింది. నేనొక ట్రైన్డ్ డాన్సర్ ని డాన్సర్. కథక్ డాన్స అంటే నాకు ప్యాషన్, నాకు ప్రాణం. ఐతే ఇండస్ట్రీలోకి వచ్చాక కథక్ పెర్ఫార్మ్ చేసే టైం దొరకలేదు. కొత్త ఏడాదిలో ఏదో చేసేద్దాం అనుకున్నా ఎంతో జోష్ తో. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తెలుస్తుంది అంటారు. అది నిజమే. ఒక షోలో డాన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం బాలయ్య బాబు సాంగ్ "దబిడి దబిడి"కి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతలో కటక్ అన్న సౌండ్ వచ్చింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ నా రైట్ లెగ్ ప్రాబ్లమ్.. హీల్స్ వేసుకుని ఎక్కువసేపు నిల్చోడం వలన మోకాలి సమస్యతో బాధపడుతున్నా . ఐతే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మోకాలి దగ్గర కటక్ అన్న సౌండ్ వినిపించినా నేను డాన్స్ చేయడం ఆపలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టుకుని నిద్రపోయా. రెండో రోజు అడుగు కూడా వేయలేకపోయాయి. దాంతో హాస్పిటల్ వెళ్ళాం. టెస్టులు చేసిన డాక్టర్ రిపోర్ట్స్ చూసి లిగమెంట్ కొంచెం క్రాక్ వచ్చింది. ఇక డాన్స్ మర్చిపోవాల్సిందే లైఫ్ లో అన్నారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే నడవగలుగుతావు అని చెప్పారు. ఆ మాటలకు అక్కడే ఏడుపొచ్చేసింది. ఇక మా ఆయన కూడా ఒక నెల రోజుల నుంచి మాట్లాడ్డం మానేశారు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నావ్. డాన్స్ చేయకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి అని అడిగి మాట్లాడలేదు. ఐతే ప్రస్తుతానికి షూట్స్ కి, షోస్ కి వెళ్తున్నాను దేవుడి దయ వలన. డాన్స్ చేయడానికి ఇంకా ఆరు నెలలు పట్టొచ్చు. మీరంతా కూడా నేను లేచి మళ్ళీ డాన్స్ చేయాలనీ దేవుడిని కోరుకోండి" అని పాపం తన బాధ మొత్తాన్ని చెప్పుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



