త్వరలో హాలీవుడ్ లో కొరియోగ్రఫీ చేయబోతున్న శేఖర్ మాష్టర్..
on Apr 17, 2025
.webp)
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ వారం షోలో శేఖర్ మాష్టర్ గురించి చిలక జోస్యం చెప్పాడు యాదమ్మ రాజు. "మాష్టర్ మీరు ఫ్యూచర్ లో హాలీవుడ్ లో కోరియోగ్రఫీ చేస్తారని మా చిలక చెప్తోంది" అన్నాడు. ఆ మాటకు "ఓహ్ వ్వావ్" అంటూ అందరూ చప్పట్లు కొట్టి కేకలేశారు. "హాలీవుడ్ వద్దురా ఇక్కడ టాలీవుడ్ వరకు చాలురా" అన్నాడు శేఖర్ మాష్టర్. "మాష్టర్ మీరు అన్ని రంగాల్లోకి వెళ్లాలన్నది మా కోరిక. మాష్టర్ హాలీవుడ్ కి వెళ్ళాలా లేదా..బాలీవుడ్ కి వెళ్లాలా లేదా..అలాగని మా టాలీవుడ్ కి అన్యాయం చేయొద్దు " అని శ్రీముఖి అరిచేసరికి అందరూ వెళ్ళాలి వెళ్ళాలి అంటూ అరిచారు. ఫైనల్ గా మీరు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు" అని చెప్పాడు రాజు. "వ్వావ్ ఐతే ఆ సినిమాలో హీరోయిన్ ని నేనా అనసూయ గారా చూడు" అంటూ అనసూయ తన చేతిని రాజుకి ఇచ్చింది. "హీరోయిన్ ... అదిదా సర్ప్రైజ్" అన్నాడు ..దాంతో శేఖర్ మాష్టర్ , అనసూయ నవ్వేశారు. "సరే సర్ప్రైజ్ గానే ఉండాలని కోరుకుంటూ మీ సీట్ లోకి వెళ్ళండి" అంది అనసూయ. ఇక సెట్ లో ఉన్నవాళ్ళంతా "హీరో హీరో " అంటూ నినాదాలు చేశారు. ఇక తర్వాత శేఖర్ మాష్టర్ చేస్తున్న సాంగ్స్ కోరియోగ్రఫీ మీద వస్తున్న ట్రోలింగ్స్ గురించి శ్రీముఖి అడిగింది. దానికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
శేఖర్ మాష్టర్ ఎంత కష్టపడి ఇంత పైకి వచ్చారో అందరికీ తెలుసు. ఏ సాంగ్ చేసినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక అన్నీ బూతద్దంలో పెట్టి చూడడం అలవాటయ్యింది. అప్పుడు శేఖర్ మాష్టర్ మాట్లాడుతూ.. సాంగ్ కోరియోగ్రఫీ చేసాక డైరెక్టర్, హీరో హీరోయిన్ చూసి ఓకే చేసాక కానీ ఎవరూ ఏదీ చేయరు. కొన్ని సిగ్నేచర్స్ పెట్టుకుంటాం. డైరెక్టర్స్ వాళ్లకు చూపించినప్పుడు అది ఓకే అని వాళ్ళు చెప్తే అదే ప్రొసీడ్ అవుతాం. అన్ని సాంగ్స్ కి కోరియోగ్రఫీ ఒకేలా చేయలేము.. ఏ సాంగ్ కి ఆ సాంగ్ కోరియోగ్రఫీ వేరుగా ఉంటుంది. ఇంతకు మించి మాట్లాడలేను ..ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలని లేదు అని చెప్పాడు శేఖర్ మాష్టర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



