సుమంత్‌కు జగన్ జాన్ జిగ్రీ అట
on Nov 16, 2016
వైఎస్ జగన్మోహనరెడ్డి..అక్కినేని సుమంత్. అసలు సంబంధమే లేని రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు. కానీ వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఎంత క్లోజంటే మనం సినిమాల్లో వింటాం కదా.?? ఒకే కంచం..ఒకే మంచమని అంత క్లోజ్. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చినిజం..ఈ విషయం ఎవరో చెప్పింది కాదూ..సాక్షాత్తూ హీరో సుమంత్ చెప్పిన మాట. కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్న సుమంత్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ..ఒకే క్లాస్‌లో..ఒకే బెంచ్‌లో కూర్చున్నామని, చిన్న వయసులో చాలా అల్లరి చేసేవారమని..పొద్దు పోయేవరకు కలిసి రోడ్లమీద తిరిగే వాళ్లమని చెప్పుకొచ్చాడు. ఒకసారి దొంగచాటుగా ఇంట్లోకి వెళుతుండగా ఏఎన్నార్ గారికి దొరికిపోయిన సంతిని చెప్పాడు.
ఓరోజు రాత్రి బాగా ఆలస్యమైపోవడంతో జగన్ మా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మేం ఇద్దరం దొంగచాటుగా నా బ్రెడ్రూంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాం. కింద నుంచి పైనున్న నా బెడ్రూమ్‌కు వెళ్లడానికి నేను గ్రిల్స్ పట్టుకుని పైకి ఎక్కుతున్నా. ఆ సమయంలో తాతగారు సడెన్‌గా బయటకు వచ్చారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తాతకు జగన్ అంటే ఎవరో తెలియదు. పై నుంచి జగన్‌ని చూపిస్తూ...అతని పేరు జగన్మోహన్‌రెడ్డి..వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని పరిచయం చేశానని చెప్పాడు సుమంత్.