చరణ్‌కి అన్యాయం చేసిన పవన్??
on Nov 16, 2016
పవన్ కల్యాణ్‌కి తన ఇంట్లో వాళ్లకంటే, తనని నమ్ముకొన్న వాళ్లు.. అభిమానులు అంటేనే ఎక్కువ ఇష్టం. చరణ్ ఆడియో ఫంక్షన్‌కి డుమ్మా కొట్టే పవన్.. నితిన్ అనగానే ఎక్కడున్నా సరే వాలిపోతుంటాడు. ఆఖరికి సప్తగిరి లాంటి వాళ్లూ ప్రేమగా పిలిస్తే వచ్చేస్తాడు. కానీ ఇంట్లోవాళ్ల కార్యక్రమం అంటే పెద్దగా పట్టించుకోడు. ఆ స్వభావం మరోసారి బయటపడింది. నితిన్ హీరోగా రూపుదిద్దుకొనే చిత్రానికి పవన్ నిర్మాతగా మారడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. నితిన్ కోసం పవన్ ఏం చేయడానికైనా సిద్దమే అనే సంకేతాలు పంపింది. ఈ కాంబో.. పవన్ అభిమానుల్నీ, నితిన్ అంటే ఇష్టపడేవాళ్లనీ తెగ సంతోషపెట్టేదే.
అయితే మెగా అభిమానులు మాత్రం కాస్త కినుక వహించడం ఖాయం. ఎందుకంటే పవన్ కల్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో చెప్పుకొంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రొడక్షన్‌లో బయటి హీరోతో సినిమా చేస్తే... అది రామ్‌చరణ్‌తోనే అనుకొన్నారు. అయితే ఆ ఛాన్స్ నితిన్ కొట్టేశాడు. దాంతో.. చరణ్ ఉసూరుమనడం ఖాయం. చరణ్‌తో సినిమా ఉంటుందా, లేదా? అనేది కూడా ఇంత వరకూ క్లారిటీ లేకుండా పోయింది. ఏదైతేనేం.. పవన్‌కి చరణ్ కంటే.. నితినే ఎక్కువ అనేది మరోసారి స్పష్టమైపోయింది.