అక్కడా బాహు"భలే"..!
on Oct 20, 2016
.jpg)
ఒకప్పుడు సినిమా ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది..ఎంత వసూలు చేసింది అన్న వాటిని కొలమానంగా తీసుకుని రికార్డులుగా చెప్పుకునేవారు. కాని కాలం మారటంతో ఇప్పుడు వాటి స్థానంలో సినిమా ఏరియా వైజ్ కలెక్షన్లు, ఎన్ని స్క్రీన్లలో రిలీజైంది, ఓవర్సీస్ కలెక్షన్లు, శాటిలైట్ రైట్స్ అంటూ కొత్త కొలమానాలు తెరమీదకు వచ్చాయి. తాజాగా యూట్యూబ్ రాకతో కొత్త రకం రికార్డులు వచ్చాయి. ఫలానా సినిమాకు ఎన్ని హిట్స్ వచ్చాయి, ఫలానా పాటను ఎంతమంది చూశారనే దానిపై హీరోల అభిమానులు గొప్పలు చెప్పుకుంటున్నారు.
తాజాగా యూట్యూబ్‌లో తెలుగు సినిమా పాటల రికార్డులపై చర్చ నడుస్తోంది. దాని ప్రకారం టాప్ ప్లేస్‌లో ఉన్న పాటలను ఒకసారి గమనిస్తే..తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ఇక్కడ కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ 13-2015న యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటలకు ఇప్పటి వరకు 94 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో సూపర్‌స్టార్ మహేశ్ నటించిన శ్రీమంతుడు నిలిచింది. జూలై 18,2015న రిలీజైన ఈ పాటలను 80 లక్షల మంది విన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



