తెరపై కేసీఆర్..!
on Oct 20, 2016

ఎన్నటికీ సాకారం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కోట్లాది మంది ప్రజల అభిమాన నాయకుడిగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర త్వరలో తెరపై కొలువుదీరనుంది. ఇప్పటికే చాలా మంది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికి అవి కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణం లేకపోలేదు..స్టూడెంట్ లీడర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమ సారధిగా ఆయన జీవితంలో భిన్న పార్శ్వాలున్నాయి.
అయితే ఆయన చరిత్రను ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపాలి..అసలు వెండితెరపై ఏం చూపించాలి వంటి విషయాల్లో క్లారిటీ లేక స్క్రిప్టు పట్టాలెక్కించలేక వెనకడుగు వేస్తున్నారు. అయితే దర్శక నిర్మాత మధుర శ్రీధర్ మాత్రం ఆ విషయంలో ఒక క్లారిటీతో ఉన్నానంటున్నారు. చిన్న నాటి నుంచి తన తండ్రి చెప్పిన సంగతులు, తాను చూసిన విషయాలు ఏర్చికూర్చి కేసీఆర్‌పై సినిమా తీస్తానంటున్నారు. 2017 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున షూటింగ్ మొదలుపెట్టి..2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



