అమెరికాకు రజనీ..ఆందోళనలో ఫ్యాన్స్..!
on Oct 20, 2016
.jpg)
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 చిత్ర షూటింగ్‌లో బిజి బిజీగా గడుపుతున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు తమిళనాట ఆందోళనను రేకెత్తిస్తోంది. అదేమిటంటే రజనీకాంత్ మరోసారి మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారట. తదుపరి షెడ్యూల్ కోసం ఉక్రేయిన్ వెళ్లాల్సి ఉండగా రజనీ ఇంత ఉన్నపళంగా అమెరికా వెళ్లటంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కబాలి రిలీజ్ సమయంలో కూడా రజనీ చాలా కాలం పాటు అమెరికాలోనే చికిత్స తీసుకున్నారు. కబాలి ప్రమోషన్‌లో సైతం పాల్గొనకుండా 40 రోజులకు పైగా యూఎస్‌లోనే ఉన్నారు. తాజాగా మరోసారి రజనీ అమెరికా వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను అటు సూపర్‌స్టార్ కుటుంబసభ్యులు కానీ రోబో-2 యూనిట్ కానీ ఖండించకపోవడంపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



