బాహుబలి విగ్రహం ఖర్చు ఎంత..?
on Oct 19, 2016
బాహుబలితో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాతించాలని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు నిర్ణయించారు. దీంతో మరోసారి ప్రభాస్ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. జాతిపిత మహాత్మగాంధీ, ప్రధాని నరేంద్రమోడీ తర్వాత అక్కడ స్థానం సంపాదించుకున్న మూడవ భారతీయుడిగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కాడు. మ్యూజియం నిర్వాహకులు హైదరాబాద్‌లో వాలిపోవడం, ప్రభాస్ కొలతలు తీసుకునివెళ్లడం చకచకా జరిగిపోయింది. దాంతో ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతా బాగానే ఉంది కాని ఈ విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుంది..? ఎవరు భరిస్తారు..అంటూ రకరకాల ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ విగ్రహానికి దాదాపు లక్షా 50 వేల పౌండ్లు ఖర్చువుతాయట..అంటే మన కరెన్సీలో చెప్పాలంటే కోటిన్నర రూపాయలన్నమాట. ఈ ఖర్చంతా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ వారే భరిస్తారట.