రెజీనాకి రింగు తొడిగిందేవరు..?
on Oct 19, 2016
శివ మనసులో శృతి అదేనండి ఎస్ఎంఎస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది చెన్నై చిన్నది రెజీనా.. ఆకట్టుకునే రూపం, కళ్లు, స్మైల్‌తో అభిమానులను ఆకట్టుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని.. చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది రెజీనా. లేటేస్ట్‌గా ఆమె నటించిన జ్యోఅచ్యుతానంద విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న నక్షత్రం సినిమాలో రెజీనా, సందీప్‌కు జోడిగా నటిస్తోంది. అసలు ఇదంతా పక్కనబెడితే తాజాగా తనకు నిశ్చితార్థం జరిగిపోయిందని స్వయంగా రెజీనా ప్రకటించింది.
అంతేకాదు కాబోయే భర్త తనకు ఉంగరాన్ని తొడుగుతున్న ఫోటోని కూడా తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. కాకపోతే ఎవరితో నిశ్చితార్థం జరిగింది..? వరుడి డీటెయిల్స్ అనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ కేవలం చేతులు కనబడే స్టిల్ మాత్రమే పోస్ట్ చేసింది. ప్రజంట్ ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్‌గా చక్కర్లు కొడుతోంది. ఒకపక్క రెజీనాని పెళ్లి చేసుకోబోయే ఆ భాగ్యవంతుడు ఎవరో అని సినీ జనాలు జుట్టు పీక్కుంటుండగా. మరోపక్క కృష్ణవంశీ సినిమాతో పాటు మరో రెండు, మూడు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్న ఈ టైంలో ఉన్నపళంగా రెజీనా మ్యారేజ్‌కి ఎందుకు రెడీ అయ్యిందా అని అర్ధం కాక ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు.