ఆ సినిమా చూసి ఐష్‌పై బిగ్‌బి కామెంట్..!
on Nov 15, 2016
రీసెంట్‌గా బాలీవుడ్‌లో కాంట్రవర్సీయల్ మూవీ ఏదైనా ఉందంటే అది "ఏ దిల్ హై ముష్కిల్"..అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉరీ ఘటన తర్వాత పాక్ నటులను భారతీయ చిత్ర పరిశ్రమ నిషేధించడం ఒక ఎత్తైతే. చాలా రోజుల తర్వాత ఐశ్వర్య అందాల ప్రదర్శన ఒకటి. మొదటి దానిని పక్కనబెడితే రెండో దాని గురించే మనం మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా..ఎందుకంటే అభిషేక్ బచ్చన్‌తో వివాహం అనంతరం సినిమాలు చేసినప్పటికీ గతంలో లాగా రొమాంటిక్ సినిమాలకు దూరంగానే ఉంది ఐష్. కానీ ఇటీవల వచ్చిన "ఏ దిల్ హై ముష్కిల్"లో మాత్రం పాత ఐశ్వర్యను గుర్తుకు తెచ్చింది. తన కంటే వయసులో చిన్నవాడైన రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌లాక్ సీన్లలో నటించి పెద్ద చర్చను లేవనెత్తింది ఈ మాజి మిస్ ప్రపంచ సుందరి.
ఈ సినిమా వల్ల ఆమె పర్సనల్ లైఫ్‌లో గొడవలు చెలరేగాయని..అమితాబ్ నుంచి అభిషేక్ వరకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యకు వ్యతిరేకంగా ఉన్నారని..ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్ కోడై కూసింది. కానీ ఆ వార్తలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాపై అమితాబ్ పాజిటివ్‌గా మాట్లాడారు. కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని చూసిన బిగ్‌బి... సినిమా చాలా బాగుందని, ఐష్ చాలా బాగా నటించిందని, తన పాత్రకు న్యాయం చేసిందని అమితాబ్ కాంప్లీమెంట్ ఇచ్చారు. మామగారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అస్పలు ఊహించని ఐశ్వర్య ఈ న్యూస్‌తో ఫుల్ ఖుషిగా ఉన్నట్లు బిటౌన్ టాక్.