విక్రమార్కుడు 2.. రెడీ!
on Nov 15, 2016
రవితేజ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది... విక్రమార్కుడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రవితేజ కోసం విజయేంద్ర ప్రసాద్ ఈ కథని రెడీ చేశారట. టైటిల్‌గా 'జింతాత జితా జితా' కన్‌ఫామ్ చేశారని సమాచారం. విక్రకమార్కుడు సినిమాలో రవితేజ మేనరిజం డైలాగ్ ఇదే. అయితే ఈ చిత్రానికి రాజమౌళి స్థానంలో ఆయన శిష్యుడు దర్శకత్వం వహిస్తారని వినికిడి. విక్రమార్కుడులో ఇద్దరు రవితేజలుంటారు. ఒకరు అత్తిలి సత్తిబాబు, ఇంకొకరరు విక్రమ్ రాథోడ్. అయితే ఈ సినిమాకి సీక్వెల్ మాత్రం అత్తిలి సత్తిబాబు క్యారెక్టరైజేషన్ చుట్టూ నడుస్తుందని టాక్. రవితేజ గత కొంతకాలంగా సరైన కథ కోసం వెదుకుతున్నాడు. కొంతమంది దర్శకులకు ఓకే చెప్పినా... చివరి క్షణాల్లో ఆ ప్రాజెక్టులు పక్కకు తప్పుకొన్నాయి. మరి ఈసారైనా విక్రమార్కుడు కథకు పచ్చజెండా ఊపుతాడో లేదో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి.