ట్రైలర్ రివ్యూ : విన్నర్
on Feb 13, 2017

తనకు తగ్గట్టుగానే మాస్, కమర్షియల్ కథల్ని ఎంచుకొంటూ, వాటిలోనే హిట్లుకొడుతూ దూసుకుపోతున్నాడు సాయిధరమ్‌తేజ్. తన నుంచి వస్తున్న మరో చిత్రం విన్నర్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఇప్పుడు థియేటరికల్ ట్రైలర్‌ని దింపారు. రెండు నిమిషాల ఈ ట్రైలర్‌లో.. మాస్‌కి నచ్చే షాట్సే కట్ చేశారు. పులి ఊరుమీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు… కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు… కానీ పెట్టుకొన్నారంటే పాతిక మందికి పైగా పోతారు.. అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
నిర్మాణ విలువలు భారీగా కనిపించినా... కొత్తదనం కోసం మాత్రం భూతద్దం పట్టుకొని మరీ వెతకాల్సిందే. ఈమధ్య వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ కలగలిపి ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి గ్లామర్ పాత్రకే పరిమితం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన నోటి నుంచి ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు. బుజ్జిగాడులోని ప్రభాస్ డైలాగ్‌ని డిట్టో పలికిన సాయి... ఎందుకనో.. అలరించలేకపోయాడు. కమర్షియల్ సూత్రాల్ని తు,చ తప్పకుండా పాటించేసిన ఈ సినిమా మాస్ ని ఏమాత్రం మురిపిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



