పవన్ సూసైడ్ చేసుకోవాలనుకున్నారా..? కారణం ఎవరు.?
on Feb 13, 2017
.jpg)
అమెరికా పర్యటనలో ఉన్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్..జాన్.ఎఫ్.కెనడీ జూనియర్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న పాత విషయాలన్నింటిని ప్రపంచానికి వెల్లడించారు. పవన్ మామూలుగా అన్యాయాన్ని సహించలేరు..ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేసే వరకు నిద్రపోరు.
ఈ లక్షణం నిన్న మొన్న వచ్చింది కాదట చిన్నప్పటి నుంచి తాను సామాజిక రుగ్మతలను పరిశీలిస్తుండేవాడినని..నటుడిని కాకముందు నుంచే చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపాలని భావించేవాడినన్నారు. దీంతో చదువులో రాణించలేక..తల్లిదండ్రులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా ఉండలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవాడినని..ఒకానొక స్టేజ్‌లో ఆత్మహత్య చేసుకుందామని భావించి..అన్నయ్య వద్ద ఉండే లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను చాలాసార్లు చేతుల్లోకి తీసుకున్నాను. కాని అమ్మ, నాన్న, అన్నయ్య ఇచ్చిన కౌన్సెలింగ్‌తో అలాంటి ఆలోచనల నుంచి బయటపడి ఈ స్థాయికి వచ్చాను అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు పవర్‌స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



