పవన్ గురించి అడిగితే చిరుకి కోపం వచ్చేసింది
on Feb 13, 2017
చిరు సహన జీవే.కోపాన్ని ఎప్పుడోగానీ ప్రదర్శించడు. అదీ మీడియా ముందు అస్సలు చూపించడు. కానీ... ఈసారి చిరుకి కాస్త చిర్రెత్తుకొచ్చే ప్రశ్న ఎదురైంది. అదీ.. పవన్ గురించి. అందుకే కాస్త తన కోపం చూపించాడు. ఎప్పుడు ఏ ప్రశ్న అడగాలో తెలీదా?? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంచింగ్ పోగ్రాంకి సంబంధించిన ప్రెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది.
మీడియా వాళ్ల నుంచి చిరుకి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో పవన్‌కి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. `పవన్‌ని మీరెప్పుడు ప్రశ్నిస్తారు` అంటూ ఓ ఛానల్ ప్రతినిథి అడిగిన ప్రశ్న చిరుని కాస్త ఇబ్బంది పెట్టింది. `ఇప్పుడు ఈ ప్రశ్న అవసరమా, ఈ పోగ్రాంకి సంబంధించిన ప్రశ్నలే వేయండి` అంటూ... తన అసహనం వ్యక్తం చేశాడు. నిజానికి ఇది కూడా మీలో ఎవరు కోటీశ్వరుడికి సంబంధించిన ప్రశ్నే. పవన్‌ని ఎప్పుడు హాట్ సీట్‌లో కూర్చోబెడతారు? అనే ప్రశ్నని చిరు మరోలా అర్థం చేసుకొన్నాడు. దాంతో.. అలా రియాక్ట్ అవ్వాల్సివచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
