కర్ణన్.. థ్యాంక్ యు బ్రదర్.. ఈ వారం ఓటీటీలో వస్తున్న కంటెంట్ ఇదే!
on May 3, 2021
కొవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లు మరోసారి మూతపడ్డాయి. దేశంలోని ఏవో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే థియేటర్లు నడుస్తున్నాయి. 2020లో లాక్‌డౌన్ టైమ్‌లో సినీ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి డిజిటల్ దిగ్గజాలకు తోటు ఆహా లాంటి పూర్తి స్థాయి తెలుగు కంటెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అందుబాటులోకి వచ్చి వెబ్ సిరీస్‌లు, సినిమాలతో అలరించాయి.
ఇప్పుడు మరోసారి జనం దృష్టి ఓటీటీవైపు మళ్లింది. అందుకు తగ్గట్లే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రతి వారం ఆడియెన్స్‌ను ఆకర్షించడానికి ఆసక్తికర ప్రాజెక్ట్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ వారం ధనుష్ నటించిన 'కర్ణన్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పాటు, అనసూయ నటించిన 'థ్యాంక్ యు బ్రదర్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షం కానున్నాయి. అలా ఓటీటీలో జనం ముందుకు వస్తున్న ఆసక్తికర కంటెంట్ ఏంటో చూద్దాం...
కల (మలయాళం మూవీ)
తారాగణం: టొవినో థామస్, దివ్య పిళ్లై, లాల్ పాల్
డైరెక్టర్: రోహిత్ వి.ఎస్.
తేదీ: మే 4
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
స్టార్ వార్స్: ద బ్యాడ్ బ్యాచ్ (యానిమేటెడ్ సిరీస్)
డైరెక్టర్: బ్రాడ్ రావ్
తేదీ: మే 4
ఓటీటీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్
జూపిటర్స్ లెగసీ (టీవీ సిరీస్)
తారాగణం: జోష్ దుహామెల్, బెన్ డేనియల్స్, లెస్లీ బిబ్
క్రియేటర్: స్టీవెన్ యస్. డినైట్
తేదీ: మే 7
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైల్‌స్టోన్ (మూవీ)
తారాగణం: లక్షవీర్ శరణ్, సువీందర్ విక్కీ
డైరెక్టర్: ఇవాన్ అయర్
తేదీ: మే 7
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
థ్యాంక్ యు బ్రదర్ (తెలుగు మూవీ)
తారాగణం: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్
డైరెక్టర్: రమేశ్ రాపర్తి
తేదీ: మే 7
ఓటీటీ: ఆహా
హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే
తారాగణం: అన్షుమన్ ఝా, జరీన్ ఖాన్, రవి కన్విల్కర్
డైరెక్టర్: హరీశ్ వ్యాస్
తేదీ: మే 9
ఓటీటీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్
కర్ణన్ (తమిళ్ మూవీ)
తారాగణం: ధనుష్, రాజిషా విజయన్, లాల్
డైరెక్టర్: మరి సెల్వరాజ్
తేదీ: మే 9
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆపరేషన్ జావా (మలయాళం మూవీ)
తారాగణం: బాలు వర్ఘీస్, లుక్మన్ లుక్కు, ఇర్షద్
డైరెక్టర్: తరుణ్ మూర్తి
తేదీ: మే 9
ఓటీటీ: జీ 5
Also Read